AP Bars e Auction: మందుబాబులకు గుడ్‌న్యూస్, 44 బార్లకు ఈ వేలం, ఏ జిల్లాలో ఎంత ఫీజు

AP Bars e Auction: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం మద్యం ఆదాయంపై దృష్టి పెట్టింది. మద్యం దుకాణాల తరువాత ఇప్పుడు బార్లకు గేట్లు తెరిచింది. భారీగా ఈ వేలం నిర్వహించింది. ఏ జిల్లాలో ఎన్ని బార్లు ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2025, 10:08 AM IST
AP Bars e Auction: మందుబాబులకు గుడ్‌న్యూస్, 44 బార్లకు ఈ వేలం, ఏ జిల్లాలో ఎంత ఫీజు

AP Bars e Auction: ఏపీలో కొత్తగా 44 బార్లు రానున్నాయి. వీటి కోసం ఏపీ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఈ వేలం నిర్వహిస్తోంది. బార్ల ఈ వేలానికి ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ణయించింది. ఆన్‌లైన్ వేలం ప్రక్రియ ద్వారా బార్ల లైసెన్సులు ఖరారు చేయనుంది. 

Add Zee News as a Preferred Source

ఏపీలో కొత్తగా 44 బార్ల ఈ వేలానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరంలో 2 బార్లు ఒకటి శృంగవరపు కోట, రెండవది రాజాం నగర పంచాయితీలో రానున్నాయి. వీటికి అప్లికేషన్ ఫీజు 5 లక్షల రూపాయలు. ఇక విశాఖపట్నంలో మొత్తం 10 బార్లు వస్తున్నాయి వీటికి అప్లికేషన్ ఫీజు ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు. తూర్పు గోదావరి జిల్లాలో 2 బార్లు నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో వస్తున్నాయి. ఒక్కొక్కదానికి రిజిస్ట్రేషన్ ఫీజు 5 లక్షల రూపాయలు. కాకినాడ 1 పరిధిలో పిఠాపురం మున్సిపాలిటీలో ఒక బార్ రానుంది. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు 750000గా నిర్ణయించారు. 

ఇక ఏలూరు జిల్లాలో చింతపూడి నగర పంచాయితీలో ఒక బార్ వస్తుంది. అప్లికేషన్ ఫీజు 5 లక్షల రూపాయలు. కృష్ణా జిల్లాలో మొత్తం 5 బార్లుకు ఈ వేలం నిర్వహిస్తున్నారు. మచిలీపట్నంలో 2, తాడిగడపలో 2, పెడనలో ఒకటి. పెడనకు రిజిస్ట్రేషన్ ఫీజు 5 లక్షలు కాగా మిగిలిన నాలుగింటికి 7,50000 రూపాయలుగా నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో 2 బార్లు ఉంటాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో 1, తిరువూరు నగర పంచాయితీలో ఒకటి ఉంటాయి. విజయవాడకు రిజిస్ట్రేషన్ ఫీజు 10 లక్షలు కాగా తిరువూరుకు 5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. 

గుంటూరులో మొత్తం 8 బార్లు వస్తున్నాయి. మంగళగిరి-తాడేపల్లిలో 1, తెనాలి మున్సిపాల్టీలో 5, పొన్నూరులో 2 ఉంటాయి. వీటిలో మంగళగిరి-తాడేపల్లికి రిజిస్ట్రేషన్ ఫీజు 10 లక్షలు కాగా మిగిలినవాటికి 750000 రూపాయలుగా నిర్ణయించారు. బాపట్లలో 3 బార్లు ఉంటాయి. రేపల్లెలో 1, చీరాల మున్సిపాలిటీలో 2 ఉంటాయి. అప్లికేషన్ ఫీజు 750000 రూపాయలుగా నిర్ణయించారు. పల్నాడులో 5 బార్‌లు ఉంటాయి. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 2, గురజాలలో 1, దాచేపల్లిలో 2. వీటిలో పిడుగురాళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజు 750000 కాగా మిగిలినవాటికి 5 లక్షల రూపాయలు ఫీజు చెల్లించాలి.

ఇక ప్రకాశం జిల్లాల్లో 2 ఉంటాయి. మార్కాపురం మున్సిపాలిటీలో 1, దర్శి నగర పంచాయితీలో 1. వీటిలో మార్కాపురంకు 750000 రిజిస్ట్రేషన్ ఫీజు కాగా దర్శి బార్ కోసం 5 లక్షల రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. తిరుపతిలో 2 ఉంటాయి. నాయుడుపేట మున్సిపాలిటీలో 1, సూళ్లూరుపేటలో 1. వీటి అప్లికేషన్ ఫీజు 5 లక్షల రూపాయలు. సత్యసాయి జిల్లాలో పెనుకొండ నగర పంచాయితీలో ఒక బార్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 5 లక్షల రూపాయలు. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 ఉంటాయి. కడపలో ఒకటి, యర్రగుంట్ల నగర పంచాయితీలో ఒకటి ఉంటుంది. కడప బార్ కోసం 750000 అప్లికేషన్ ఫీజు కాగా యర్రగుంట్లకు 5 లక్షల రూపాయలు చెల్లించాలి.

ఎప్పుడు చివరి తేదీ

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లింపుకు అయితే ఏప్రిల్ 8 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. ఏప్రిల్ 8న దరఖాస్తుల స్క్రూటినీ ఉంటుంది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు బిడ్డింగ్ ఉంటుంది. అదే రోజు మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రివైజ్డ్ బిడ్డింగ్ సదుపాయం ఉంటుంది.

Also read: Waqf Amedement Bill Pass In Rajya Sabha: ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు.. రాష్ట్రపతి సంతకమే ఆలస్యం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News