Amaravati Capital Works: అమరావతిలో మళ్లీ భూ సమీకరణ, మరో 44 వేల ఎకరాలు

Amaravati Capital Works: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి ల్యాండ్ పూలింగ్  జరగనుంది. రాజధాని అవసరాల కోసమో లేదా పెద్దల భూ దాహం కోసమో మరి భారీగా భూమి సమీకరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. అదే జరిగితే అమరావతి విస్తీర్ణం రెట్టింపు కావడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 14, 2025, 07:24 PM IST
Amaravati Capital Works: అమరావతిలో మళ్లీ భూ సమీకరణ, మరో 44 వేల ఎకరాలు

Amaravati Capital Works: ఇంకా అమరావతి నిర్మాణమే ప్రారంభం కాలేదు. అప్పుడే విస్తరణకు సిద్ధమౌతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడున్న 34 వేల ఎకరాలు కాకుండా అదనంగా మరో 44 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రైతులతో జరుపుతున్న చర్చలు ఫలప్రదమైతే అమరావతి నిర్మాణానికి ముందే రెట్టింపు కంటే అధికం కానుంది. 

Add Zee News as a Preferred Source

ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి. ఇంకా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కొన్ని తాత్కాలిక నిర్మాణాలు, రోడ్లు నిర్మితమై ఇప్పుడు పునర్ నిర్మాణ పనులు ఘనంగా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు అదనంగా మరో 44 వేల ఎకరాలు సమీకరించేందుకు సిద్ధమౌతోంది. రాజధాని విస్తరణ పేరుతో బడా బాబులకు భూములు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం వద్ద రైతుల నుంచి సమీకరించిన 34 వేల 568 ఎకరాలకు ప్రభుత్వ భూమి కలుపుకుంటే 53,749 ఎకరాలు ఉన్నాయి. అయినా ఈ భూమి రాజధాని నిర్మాణానికి సరిపోదంటోంది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా మరే 44, 676 వేల ఎకరాలను సమీకరించేందుకు సిద్ధమైంది. ఈ దశగా ఇప్పటికే తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులతో చర్చలు జరుపుతున్నారు అధికారులు. 

రాజధాని విస్తరణ పేరుతో బడా బాబులకు, కార్పొరేట్ సంస్థలు అదనంగా సమీకరించే భూమి కట్టబెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. రాజధాని ప్రాంతంలో స్థలాల కోసం వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయని, డిమాండ్ పెరుగుతోందని ప్రభుత్వమే చెబుతోంది. వివిధ ప్రాజెక్టులు కంపెనీల స్థాపన, అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే లైన్, మెట్రో వంటి అవసరాలకు ఉన్న భూమి సరిపోదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అదనంగా మరో 44 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. 

ఏ గ్రామంలో ఎంతెంత భూ సమీకరణ

తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 11 గ్రామాల్లో 44 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురంలో 2,429.05 ఎకరాలు, వడ్డమానులో 1937.31 ఎకరాలు, పెదపరిమిలో 6,513.69 ఎకరాలు కావల్సి ఉంది. ఇక అమరావతి మండలం వైకుంఠపురంలో 3,360.63 ఎకరాలు, ఎండ్రాయిలో 2,167.11 ఎకరాలు, కర్లపూడిలో 2,947.06 ఎకరాలు, మోతడక గ్రామంలో 2,345.03 ఎకరాలు, నిడుముక్కలలో 2,013,06 ఎకరాలు అవసరముంది. ఇక తాడికొండ మండలంలో 12,797 ఎకరాలు, కంతేరులో 3,671 ఎకరాలు కావల్సి ఉన్నాయి. మంగళగిరి మండలం కాజ గ్రామ పరిధిలో 4,492.37 ఎకరాలు అవసరం. 

అమరావతిలో విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ సహా నవ నగరాల నిర్మాణానికి ఈ భూమి అవసరం. దీనికోసం ప్రభుత్వం భూ సేకరణ చేయాలా లేక భూ సమీకరణ చేయాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని ప్రైవేటు ఆర్ధిక సంస్థలు, బ్యాంకుల నుంచే కాకుండా కేంద్ర ప్రభుత్వ హామీతో వరల్డ్ బ్యాక్, ఏడీబీ బ్యాంకు, హడ్కో నుంచి సమకూర్చుకోనుంది.

Also read: Tirumala Accommodation: తిరుమల వసతి గదులు కేటాయింపు ఇక చాలా ఈజీ, అమల్లోకి కొత్త ప్రక్రియ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News