Amaravati Works: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ముహూర్తం సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. పనుల ప్రారంభం ఘనంగా నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో రుణాలతో అమరావతి పనులు చేపడుతోంది ప్రభుత్వం.
ఏడీబీ, హడ్కో, ప్రపంచబ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో తొలిదశలో 31 వేల కోట్ల రూపాయలు రానున్నాయి. వాస్తవానికి జనవరి నెలలోనే సీఆర్డీఏ , ఏడీసీఎల్ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనా ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైంది. అమరావతిలో మొత్తం 73 పనులను 48 వేల కోట్లతో చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చింది. 62 పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. వచ్చిన బిడ్లను పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేయాల్సి ఉంది. అమరావతి కోసం పిలిచిన టెండర్లలో 4 పనులకు ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో మరోసారి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఎన్జీఓ, జీవో క్వార్టర్ల నిర్మాణ పనులకు టెండర్లు ఖరారు కాలేదు. రైతులకు ఇచ్చిన రిటర్న్ ప్లాట్స్‌లో మౌళిక సదుపాయాల కల్పనకు టెండర్లు గడువు ముగిసింది. ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. బంగ్లా పనుల టెంటర్ల గడువు కూడా మార్చ్ 7తో ముగిసినా ఒక్క బిడ్ దాఖలు కాలేదు. ఈ పనులకు టెండర్లు ఎందుకు దాఖలు కాలేదనే అంశంపై సమీక్షించి అవసరమైన మార్పులు చేసి మరోసారి టెండర్లు పిలవనున్నారు. ఇక ఐకానిక్ టవర్ల నిర్మాణం నిమిత్తం పునాదుల పటిష్టత పరిశీలించిన తరువాతే టెండర్లు పిలుస్తారు.
అన్నింటినీ సమీక్షించిన తరువాత మార్చ్ 12 -15 మధ్యలో అమరావతి పనుల ప్రారంభం అట్టహాసంగా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది.
Also read: Govt Employees: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఇకపై ఎంత పిల్లలు ఉన్నా సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









