AP Government: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంకా చాలా వరకు సంక్షేమ పధకాలపై స్పష్టత లేదు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో సమర్ధవంతంగా అమలైన ఆరోగ్య శ్రీ అటకెక్కింది. ఇప్పుడు విమర్శలు తీవ్రమవడంతో ఈ పధకానికి మార్పులు చేసి అమలు చేసేందుకు సిద్ధమైంది.
గత ప్రభుత్వం 10 లక్షలుగా ఉన్న ఆరోగ్య శ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచింది. అయితే ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పధకాన్ని నిర్లక్ష్యం చేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇదే పథకాన్ని భీమా పధకంగా మార్పు చేసింది. ప్రతి కుటుంబానికి ఆరోగ్య శ్రీ కాకుడా ఆరోగ్య బీమా అందించాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సేవల్ని ఇకపై బీమా పద్ధతిలో అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఓ డ్రాఫ్ట్ సిద్ధం చేసింది. ఈ డ్రాఫ్ట్‌కు రాష్ట్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేయగానే అమల్లోకి వస్తుంది. ఇందులో పేద, ధనిక తేడా లేకుండా అందరికీ అంటే అన్ని కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం రెడీ అయింది.
రాష్ట్రంలో మొత్తం 1.43 కోట్ల కుటుంబాలున్నాయి. వీరిలో దారిద్ర్య రేఖకు ఎగువన 20 లక్షల కుటుంబాలున్నాయి. వీరందరికీ ఎలాంటి షరతులు లేకుండా ఆరోగ్య భీమా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీమా కంపెనీల ద్వారా 2.5 లక్షల వరకు వైద్య సేవలు అందించనుంది. అంతకు మించితే మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది. 25 లక్షల వరకు ఖర్చును వైద్య ఆరోగ్య ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఇది హైబ్రిడ్ విధానం. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్ని రెండు భాగాలుగా చేసి టెండర్లు పిలవనుంది ప్రభుత్వం. మొత్తం 3,257 రకాల చికిత్సలను కొనసాగిస్తూనే బీమా విధానంలో 2,250 చికిత్సలు అందించనున్నారు.
టెండర్ల ద్వారా ఏడాది కాలపరిమితికి బీమా కంపెనీలను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. రెండేళ్ల వరకు బీమా కంపెనీలకు రెన్యువల్ ఉంటుంది. ప్రభుత్వం దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటన చేయనుంది.
Also read: Terrorist Movements: ఏపీలో ఉగ్ర కదలికలపై పవన్ కళ్యాణ్ ఆరా, ప్రత్యేక సూచనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి