Amaravati Works: అమరావతిలో సీన్ రిపీట్, సింగపూర్ రీ ఎంట్రీ, ప్రధాని మోదీతో రీ లాంచ్

Amaravati Works: ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు రీ లాంచ్ కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు అమరావతిలో సింగపూర్ మళ్లీ ఎంట్రీ ఇస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2025, 06:22 PM IST
Amaravati Works: అమరావతిలో సీన్ రిపీట్, సింగపూర్ రీ ఎంట్రీ, ప్రధాని మోదీతో రీ లాంచ్

Amaravati Works: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. వివిధ పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు పనులు ప్రారంభించేందుకు సిద్ధం అవుతుండగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీతో రీ లాంచ్ కార్యక్రమం నిర్వహించనుంది. 

Add Zee News as a Preferred Source

ఏపీ అమరావతి పనుల ప్రారంభంలో రెండు అంశాలు పునరావృతం కానున్నాయి. 2014-19 మద్య కాలంలో అమరావతి నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా తిరిగి ఇప్పుడు అయన చేతుల మీదుగా అవే పనులకు రీ లాంచ్ జరగనుంది. ఈ నెలలోనే అమరావతి నిర్మాణ పనులను అత్యంత ఘనంగా ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మరో వైపు 2014-19 మద్య కాలంలో అమరావతి నిర్మాణ విషయంలో కీలకంగా వ్యవహరించిన సింగపూర్ ఇప్పుడు తిరిగి కీలకం కానుంది. అమరావతి నిర్మాణ పనుల్లో ఎంట్రీ ఇవ్వనుంది. 

అమరావతి నిర్మాణంలో కీలక భాగస్వామిగా ఉన్న సింగపూర్ ప్రతినిధి బృందం ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తోంది. కోర్ కేపిటల్ ప్రాంతంలోని నిర్మాణాలను పరిశీలిస్తోంది. అమరావతిలో ప్రభుత్వం తలపెట్టిన స్టార్టప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. గతంలో అమరావతి ప్రాంతంలో సింగపూర్ స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ కోసం సింగపూర్ కన్సార్టియంకు 1900 ఎకరాల భూమి కేటాయించారు. మాస్టర్ ప్లాన్ ఖరారులో కూడా సింగపూర్ కీలకంగా వ్యవహరించింది. 

ఈ ఐదేళ్ల కాలంలో అమరావతిలో మారిన పరిస్థితులు, వరద నియంత్రణకు తీసుకున్న చర్యలు, కరకట్ట రోడ్డు, ఉద్దండరాయుని పాలెం, తాళ్లాయపాలెం స్టార్టప్ ఏరియా, ఐఏఎస్ అధికారుల టవర్స్, మంత్రుల నివాస సముదాయాల్ని సింగపూర్ బృందం పరిశీలించింది. ఇలా రాజధాని అమరావతి ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అమరావతిలోని అన్ని ప్రాంతాల్ని పూర్తిగా సందర్శించి పరిశీలించిన అనంతరం ఈ బృందం సీఆర్డీఏ, మున్సిపల్ శాఖ అధికారులతో ఛీఫ్ సెక్రటరీ విజయానంద్ భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల మూడో వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనుల రీ లాంచ్ ఘనంగా జరగనుంది. 2027 నాటికి తొలి దశ పనులు పూర్తిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. 

Also read: IMD Weather Report: దేశంలో విభిన్న వాతావరణం, ఉత్తరాన ఎండలు, దక్షిణంలో వర్షాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News