AP New Projects: ఏపీలో కొత్తగా పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటోంది. పర్యాటకుల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు, అన్ని విధాల సౌకర్యాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా అమరావతి, పోలవరం, తిరుపతిలో హోటల్లు, రిసార్టులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఏపీలోని అమరావతి, తిరుపతి, పోలవరంలో కొత్త హోటల్లు, రిసార్టులు రానున్నాయి. అమరావతిలో గ్రీన్ పార్క్ హోటల్స్, పోలవరంలో మెగ్లాన్ లీజర్స్, తిరుపతిలో పావని హోటల్స్ ఆధ్వర్యంలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టులకు ఎస్‌జీఎస్‌టి, స్టాంప్ డ్యూటీతో పాటు స్థిర మూలధన పెట్టుబడిలో రాయితీలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 145 కోట్లతో అమరావతిలో గ్రీన్ పార్క్ 4 స్టార్ హోటల్, 255 కోట్లతో మెగ్లాన్ లీజర్స్ ఫైన్ స్టార్ రిసార్ట్స్, 80.46 కోట్లతో తిరుపతిలో పావని హోటల్స్ ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కానుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోత్సాహక మండలి ఈ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను ఆమోదించింది. విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ సుంకం, ఆస్తి పన్ను, వాటర్ ఛార్జీల్లో రాయితీలు కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి కూడా కలుగుతుంది. ఇప్పటికే పోలవరంలో రిసార్ట్ నిర్మాణం కోసం మెగ్లాన్ లీజర్స్ సంస్థకు 15.25 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 66 ఏళ్ల లీజుకు ఈ భూమిని అప్పగించారు. వార్షిక లీజు ఎంతనేది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ణయించిన విలువ ఆధారంగా ఉంటుంది.
Also read: Havelock Bridge: రూపురేఖలు మారనున్న గోదావరి పాత వంతెన ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook









