AP Inter Syllabus: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కీలకమైన మార్పులు రానున్నాయి. కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ ఇంటర్మీడియట్‌లో NCERT సిలబస్ ప్రవేశపెట్టనున్నారు. అటు పరీక్షా విధానం కూడా మారనుంది. జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులకు ఈ విధానం చాలా ఉపయోగపడనుంది.
ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2025-26 నుంచి కీలకమైన మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఇంటర్ విద్యా విధానం మారిపోనుంది. ఇప్పటి వరకు మేథ్స్ పరీక్ష ఏబీలుగా చెరో 75 మార్కులకు కలిపి మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తుండగా ఇకపై 100 మార్కుల పేపర్‌గా మార్పు జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ చెరో 60 మార్కులకు ఉంటే ఇకపై 85 మార్కులకు ఉండనుంది. బోటనీ, జువాలజీ కలిపి ఒకే పేపర్ ఉంటుంది. బోటనీ 43 మార్కులకు, జువాలజీ 42 మార్కులకు కలిపి 85 మార్కులుంటాయి. ఇక మొదటి ఏడాది 15 మార్కులు, రెండో ఏడాది 15 మార్కులు ప్రాక్టికల్స్ ఉంటాయి. అదే విధంగా సీఈసీ విద్యార్ధులకు కామర్స్, ఎక్కౌంట్స్ కలిపి 50 మార్కులకు ఉంటుంది.
స్థూలంగా చెప్పాలంటే సైన్స్ గ్రూపులకు ఇకపై 5 సబ్జెక్టులే ఉంటాయి. ఇక పరీక్ష విధానం ఓసారి చూసుకుంటే అన్ని పేపర్లలో ఒక మార్కు ప్రశ్నలు ఉంటాయి. మేథ్స్ సెక్షన్ ఎలో 1 మార్కు ప్రశ్నలు 12, ఫిజిక్స్ -కెమిస్ట్రీలో 9 ఉంటాయి. ఇక 2 మార్కుల ప్రశ్నలు మేథ్స్ లో 10 ఉంటే ఫిజిక్స్-కెమిస్ట్రీలో 14 ఉంటాయి. వీటిలో 4, 8 మార్కుల ప్రశ్నలు ఛాయిస్‌తో ఉంటాయి. బోటనీ ,జువాలజీలో 2,4,8 మార్కుల ప్రశ్నలుంటాయి. పాలిటిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్‌లో 10 మార్కులు, 2 మార్కులు, 4 మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
మొత్తం సిలబస్ NCERT కావడంతో పాటు 1 మార్కు ప్రశ్నలకు పెద్దపీట ఇవ్వడం వల్ల జేఏఈ, నీట్‌కు సిద్ధమయ్యే విద్యార్ధులకు చాలా సులభమౌతుంది. ఇప్పటి వరకు ఉన్న విధానంలో అయితే ఇంటర్ పరీక్షలకు ఒక సిలబస్, నీట్, జేఈఈ పరీక్షలకు మరో సిలబస్ చదవాల్సి వచ్చేది. ఇకపై మొత్తం NCERT కావడంతో చాలా సునాయసమౌతుంది.
Also read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, ఎప్పుడు అమలవుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









