
AP Government: పింఛన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా పధకం కింద పింఛన్లు అందించనుంది. కొత్తగా మరో లక్ష మందికి ఈ పింఛన్లు అందించనుంది. కొత్త పింఛన్లను మే నుంచి ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పధకంలో భాగంగా మరో 93 వేల మందికి పింఛన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ ఏడాదిలోనే మే నెల నుంచి కొత్తగా ఎంపికైన అర్హులందరికీ పెన్షన్లు జారీ కానున్నాయి. సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరాలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5 లక్షల మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించామన్నారు. అందరికీ త్వరలోనే పింఛన్లు ఇస్తామని చెప్పారు. అదే విధంగా ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని యూనిట్‌గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
కొత్తగా మరో 93 వేల మందికి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వ అధికారులు ఇప్పటికే అంతా సిద్ధం చేశారు. మే నెల నుంచి కొత్త పింఛన్లు అందించవచ్చు. వాస్తవానికి ఏప్రిల్ నెల నుంచి అందించాలని అనుకుంది. కానీ కష్టమని తేలడంతో మే నుంచి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇంకా అధికారికంగా ఏపీ ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన పింఛన్లలో అనర్హులైన 14 వేల మందికి పింఛనలు తొలగించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా మంజూరైన 93 వేల పింఛన్లు వితంతు పెన్షన్లని అధికారులు తెలిపారు. నెలకు నాలుగు వేల రూపాయలు పింఛన్ మే నెల నుంచి అందనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 60 లక్షల మందికి ప్రతి నెలా పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా మరో 5 లక్షల మందిని గుర్తించారు. ఈ 5 లక్షల మందికి ఎప్పటి నుంచి అందిస్తారో ఇంకా స్పష్టత లేదు. కానీ 93 వేల మందికి మాత్రం మే నుంచి నెలకు 4 వేల రూపాయలు పెన్షన్ అందించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి