
AP Work From Home: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న పధకం ప్రారంభించనున్నారు. మహిళలు, యువతీ యువకులు అందరూ ఇంట్లోంచే డబ్బులు సంపాదించే అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా సర్వే దాదాపుగా పూర్తయింది. ఇక త్వరలోనే ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం ప్రారంభించనుంది.
ఏపీ ప్రభుత్వం కొత్తగా వర్క్ ఫ్రం హోం ప్రారంభించనుంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 18 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్నవారిని ఎంచుకుంటున్నారు. తగిన మౌళిక సదుపాయాలు కల్పిస్తే ఎంతమంది వర్క్ ఫ్రం హోం చేసేందుకు సిద్ధంగా ఉన్నారో తెలుసుకునేందుకు ఇప్పటికే సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే జరుగుతోంది. ఈ సర్వే దాదాపుగా పూర్తయింది. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది వర్క్ ఫ్రం హోంకు సిద్ధంగా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. ఈ వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు.
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించిన సర్వేలో 25 లక్షల మంది వర్క్ ఫ్రం హోంకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 18-50 ఏళ్ల మధ్యలో ఉన్నవారు 2.86 కోట్ల మంది ఉండగా, ఇప్పటికే కోటి మంది సర్వే పూర్తయింది. వీరిలో 11 లక్షల మంది ఇంటర్ చదివి ఉంటే 13 లక్షల మంది డిప్లొమో లేదా అంతకంటే ఎక్కువ చదివారు. వర్క్ ఫ్రం హోం కోసం సదుపాయం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 118 ప్రభుత్వ భవనాలను గుర్తించారు. వీరిలో 2.13 లక్షల మంది ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరులోని ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నట్టు సర్వేలో తేలింది.
త్వరలో మిగిలిన సర్వే కూడా పూర్తయ్యాక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. వర్క్ ఫ్రం హోం ఎలా ఉంటుంది, ఎలాంటి పని చేయాల్సి ఉంటుంది, నెలకు ఎంత సంపాదించే అవకాశం ఉంటుందనే వివరాలపై ఇంకా స్పష్టత లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి