Andhra Pradesh: ఏపీ సర్కారు మరో సంచలనం..కొత్తగా 2 జిల్లాలు, 6 రెవెన్యూ డివిజన్లలకు గ్రీన్ సిగ్నల్.. డిటెయిల్స్..

ap Chandrababu naidu govt: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా పునర్విభజన దిశగా సీఎం చంద్రబాబు  ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోంది. దీనిలో భాగంగా రెండు జిల్లాలు, ఆరు కొత్తగా రెవెన్యూ డివిజన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Nov 6, 2025, 02:27 PM IST
  • ఏపీలో కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు..
  • చంద్రబాబు సర్కారు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
Andhra Pradesh: ఏపీ సర్కారు మరో సంచలనం..కొత్తగా 2 జిల్లాలు, 6 రెవెన్యూ డివిజన్లలకు గ్రీన్ సిగ్నల్.. డిటెయిల్స్..

Ap govt cabinet sub committee key decision on new districts and revenue divisions: ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు  ఎన్నికల్లో ఇచ్చిన హమీలు నెరవేరుస్తు ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఏపీని అనుకొని విపత్తులు ఎదురైన ఏపీ సర్కారు వాటిని ఎదుర్కొని ఏపీని డెవలప్ మెంట్ పథంవైపుకు తీసుకెళ్తున్నారు.  ఈ క్రమంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఏపీ సర్కారు మంత్రి వర్గ ఉపసంఘంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ప్రజలకు మెరుగైన సదుపాయలు, వారి ఆకాంక్షల మేరకు పలు తాజాగా.. కీలక నిర్ణయం తీసుకుంది. 

Add Zee News as a Preferred Source

ఆంధ్రప్రద్రేశ్‌లో జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు సర్కారు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఈ విషయంలో.. గతంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో విస్తృత చర్చలు జరిగాయి. అయితే.. తాజాగా.. ఏపీలో 2 కొత్త జిల్లాలు, 6 కొత్త రెవెన్యూ డివిజన్లకు మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. అలాగే 6 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసింది.

Read more: Python In Tirumala Video: గుండెలు గుభేల్.. తిరుమల ఘాట్‌ రోడ్డులో భారీ కొండ చిలువ.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..

ఇక జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా .. నూజివీడు నియోజకవర్గంను ఏలూరు జిల్లా నుంచి ఎన్టీఆర్‌ జిల్లాలోకి, కైకలూరు నియోజకవర్గంను కృష్ణా జిల్లాలోకి, గూడూరు నియోజకవర్గంను తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి తిరిగి చేర్చే ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలపై తుది ఆమోదం త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో తీసుకోనున్నట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News