Heat Waves Alert: ఏపీకు వడగాలుల హెచ్చరిక, 58 మండలాల్లో తీవ్ర ప్రభావం వృద్ధులు చిన్నారులు జాగ్రత్త

Heat Waves Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతల పెరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 58 మండలాలకు విపత్తు నిర్వహణ శాఖ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2025, 04:22 PM IST
Heat Waves Alert: ఏపీకు వడగాలుల హెచ్చరిక, 58 మండలాల్లో తీవ్ర ప్రభావం వృద్ధులు చిన్నారులు జాగ్రత్త

Heat Waves Alert: మార్చ్ నెలలోనే వేసవి ప్రతాపం చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చ్ నెల మూడో వారంలోనే పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటడం ఆందోళన కల్గిస్తోంది. మరోవైపు వడగాలుల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని 58 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. 

Add Zee News as a Preferred Source

ఏపీలో రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. అటు వడగాలులు కూడా వీస్తున్నాయి. రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత మరింతగా పెరగవచ్చని ఐఎండీ వెల్లడించింది. శ్రీకాకుళంలో 13 మండలాలు, విజయనగరంలో 18 మండలాలు, పార్వతీపురం మన్యంలో 14 మండలాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 మండలాలు, కాకినాడలో 2, తూర్పు గోదావరిలో 7 మండలాలు, ఏలూరు జిల్లాలో 1 మండలంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. నిన్న మంగళవారం నంద్యాలలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 42.6 డిగ్రీలు నమోదైంది. 

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటోంది. సాధారణం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువ నమోదవుతోంది. కడపలో 41.8 డిగ్రీలు నమోదు కాగా ప్రకాశం జిల్లాలో 41.5 డిగ్రీలు ఉంది. ఓ వైపు ఉష్ణోగ్రత మరోవైపు వడగాలులు అధికంగా ఉండటంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరుతున్నారు. ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువగా నీళ్లు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పుచ్చకాయ, దోసకాయ వంటివి తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు. 

ఇక రానున్న ఏప్రిల్-మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని ఐఎండీ తెలిపింది. ఈసారి మే నెలలో పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల వరకు చేరవచ్చని అంచనా ఉంది. ఇక వడగాలులు మే నెలలో భయంకరంగా ఉండవచ్చు. 

Also read: Sunita Williams Return Journey: సునీతా విలియమ్స్ రిటర్న్ టు ఎర్త్ జర్నీలో ఏ క్షణం ఏం జరిగింది, ల్యాండింగ్ ఎలా జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News