)
AP Rain Alert: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి తోడు గురువారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయంటోంది. నేడు, రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని ప్రత్యేకంగా హెచ్చరించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.
అటు కోస్తాంధ్రలో మత్స్య కారులకు ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. భారీ తుఫాను నేపథ్యంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. బంగాళాఖాతంలో భారీ వర్షాల నేపథ్యంలో చేపల ఈదురు గాలులకు తిరగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికాలు జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.