)
AP Rain: అల్ప పీడన ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. నిన్న బాపట్ల జిల్లాలో 9.5 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదు అయింది. వైయస్ఆర్ కడప జిల్లాలో పెద్ద ముడియంలో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 6 సెం.మీ నుంచి 7 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ, వాయవ్య గాలుల ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయిని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పడవల్లో వేటకు వెళ్లే జాలర్లు లైఫ్ జాకెట్లు తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఈదురు గాలులతో ఓ మోస్తరు పడవలు కూడా తిరగబడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధ్యమైనంత వరకు బలమైన ఈదురు గాలులు వీచే ఈ సమయంలో సముద్రంలో వెళ్లకూడదనే చెబుతుంది. పలుచోట్ల పిడుగులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కళ్లాల్లో ఎలాంటి ధాన్యాలు ఆరబోయద్దని చెబుతుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా వాయవ్య, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు (ఆగష్టు 13న) అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయి. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లతోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.