)
AP Inter Results 2025: ఏపీలో ఇంటర్ ఫలితాల సమయం సమీపిస్తోంది. మార్చ్ 1 నుంచి 20 వరకూ పరీక్షలు జరగగా ప్రస్తుతం వాల్యుయేషన్ ప్రక్రియ చివరి అంకంలో ఉంది. మరో వారం రోజుల్లో ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ సన్నాహాలు చేస్తోంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఈసారి వాట్సప్ ద్వారా కూడా ఫలితాలు వెల్లడించనుంది.
ఏపీలో ఇంటర్ పరీక్షలు పూర్తయి అప్పుడే 15 రోజులవుతోంది. ప్రస్తుతం పేపర్ వాల్యుయేషన్ జరుగుతోంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చ్ 1 నుంచి 19 వరకు జరిగితే రెండో సంవత్సరం పరీక్షలు మార్చ్ 3 నుంచి 20 వరకూ జరిగాయి. పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 6 నాటికి పూర్తి కావచ్చు. ఆ తరువాత మార్కుల కంప్యూటరీకరణ ఉంటుంది. ఏప్రిల్ 12-15 మధ్యలో ఫలితాలు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఎప్పటిలానే https://bieap.apcfss.in/ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.
ఇది కాకుండా ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సప్ సేవలతో కూడా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు. మార్కుల మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సప్ ద్వారా ఇంటర్ మార్కులు ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం.
ముందుగా మీ మొబైల్ ఫోన్లో ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు Hi అని టైప్ చేసి పంపించాలి. ఆ తరువాత సెలెక్ట్ సర్వీస్ కన్పిస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేయాలి. అక్కడి నుంచి డౌన్లోడ్ ఎగ్జామ్ రిజల్ట్స్ క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మట్ చేస్తే చాలు మీ మార్కుల మెమో పీడీఎఫ్ కాపీ వాట్సప్‌కు చేరుతుంది.
ఏపీ ఇంటర్మీడియట్ బోర్ట్ అధికారిక పోర్టల్ bie.ap.gov.in నుంచి కూడా ఫలితాలు ఎప్పటిలానే తెలుసుకోవచ్చు. ముందుగా సైట్ ఓపెన్ చేసి అందులో కన్పించే ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2025 క్లిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. చివరిగా సబ్మిట్ చేస్తే చాలు మీ మార్కులు ప్రత్యక్షమౌతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి