
AP Inter Supplementary Results 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఒకటి రెండ్రోజుల్లో ఫలితాలు విడుదల చేసేందుకు ఏపీ విద్యాశాఖ సిద్ధమైంది. ఈ ఫలితాలను resultsbie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవాలి. కేవలం మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
ఏపీలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి మే 20 వరకు జరిగాయి. ఏపీ ఈఏపీసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్ధులు, డిగ్రీలో చేరే విద్యార్ధులు ఈ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇంటర్ ఫలితాలను ఏపీ వాట్సప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఏపీ వాట్సప్ నెంబర్ 9552300009 నెంబర్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఏపీ వాట్సప్ నెంబర్ నుంచి హాయ్ అని మెస్సేజ్ పంపించి ఆ తరువాత సర్వీసెస్ విభాగంలో ఎడ్యుకేషన్ ఎంచుకోవాలి. ఆ తరువాత ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల లింక్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు పీడీఎఫ్ రూపంలో వాట్సప్‌కు ఫలితాలు వచ్చేస్తాయి.
resultsbie.ap.gov.in క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా కూడా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చు. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల వాల్యుయేషన్ దాదాపుగా పూర్తయింది. ఒకటి రెండ్రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook