
AP Inter Board: ఏపీ ఇంటర్ విద్యలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న పరీక్ష విధానం మారనుంది. ఇకపై ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపిక ఉంటుంది. చదివే ఆరు సబ్జెక్టుల్లో ఆరవది ఫెయిల్ అయినా ఎలాంటి సమస్య ఉండదు. పరీక్ష విధానంలో కొత్త మార్పులతో వచ్చే విద్య సంవత్సరానికి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ సిద్ధమౌతోంది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ఇకపై ఐదు కాకుండా ఆరు సబ్జెక్టులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆరవ సబ్జెక్టుకు ఆప్షనల్ ఉంటుంది. ఈ ఆరవ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినా ఎలాంటి సమస్య ఉండదు. అంటే తప్పనిసరి ఉత్తీర్ణత ఉండదు. ఇకపై ఇంటర్ మొదటి ఏడాది పార్ 1 లో భాగంగా ఇంగ్లీషు ఉంటుంది. పార్ట్ 2లో తెలుగు, సంస్కృతం, అరబిక్, హిందీ వంటి భాషలుంటాయి. పార్ట్ 3లో ఎంపీసీ, బైపీసీ ఉంటాయి. ఎవరైనా ఎంపీసీ తీసుకుని ఆరవ సబ్జెక్టుగా బయోలజీ తీసుకుంటే ఇందులో తప్పనిసరిగా పాస్ అవాల్సిన అవసరం లేదు. ఇందులో కూడా ఉత్తీర్ణత లభిస్తే మెమో ప్రత్యేకంగా జారీ అవుతుంది. ఇదే ఎంబైపీసీ గ్రూప్. ఈ గ్రూప్ తీసుకుంటే అటు ఇంజనీరింగ్ ఇటు నీట్ రెండింటికీ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సరే ఆరవ సబ్జెక్ట్ ఆప్షనల్ మాత్రమే.
ఇక ప్రశ్నాపత్రాల విధానంలో కూడా మార్పులు రానున్నాయి. డిస్క్రిప్టివ్ కంటే 1 లేదా 2 మార్కుల మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే ఎక్కువగా ఉండవచ్చు. సిలబస్ కూడా పూర్తిగా సీబీఎస్ఈ విధానానికి అప్‌గ్రేడ్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి