AP Inter Results 2025: ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ ఎలా అప్లై చేసుకోవచ్చు

AP Inter Results 2025: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఇంటర్ ఫలితాలు విడుదలతో పాటు రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ ప్రక్రియ వివరాలు ప్రకటించింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్. ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2025, 08:27 PM IST
AP Inter Results 2025: ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ ఎలా అప్లై చేసుకోవచ్చు

AP Inter Results 2025: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 17 వేల మంది హాజరు కాగా మొదటి ఏడాదిలో 70 శాతం, ద్వితీయ సంవత్సరంలో  83 శాతం ఉత్తీర్ణత పొందారు. రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ తేదీలు వెల్లడయ్యాయి. ఎలా అప్లై చేయాలనేది వివరాలు పరిశీలిద్దాం.

Add Zee News as a Preferred Source

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలతో పాటు సప్లిమెంటరీ తేదీలు విడుదలయ్యాయి. సప్లిమెంటరీ పరీక్షలకు అప్లై చేసేందుకు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 22 వరకూ గడువు ఉంది. ఈ గడువులోగా నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకూ జరగనున్నాయి. రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు తిరిగి మద్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. 

ఇంటర్ పరీక్ష ఫలితాలతో అసంతృప్తిగా ఉంటే రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకూ దీనికి అవకాశముంది. ఆన్ లైన్ లో ఇంట్లో కూర్చుని రీ కౌంటింగ్ లేదా రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేయవచ్చు. దీనికోసం ముందుగా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://bieap.apcfss.in/ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ పై రీ వెరిఫికేషన్-రీ కౌంటింగ్ ఆప్షన్ కన్పిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేశాక మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, మెయిల్ ఐడీ వివరాలు నమోదు చేయాలి. 

ఆ తరువాాత గెట్ డేటా ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ పై కన్పించే వివరాలు సరి చూసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కు సంబంధించిన నిర్ణీత ఫీజు ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తరువాత దరఖాస్తు సమర్పించాలి. 

రీ కౌంటింగ్ లేదా రీ వాల్యుయేషన్ చేసినప్పుడు మార్కుల్లో మార్పు లేకపోయినా ఫీజు వాపసు ఇవ్వరు. రీ వాల్యుయేషన్ తరువాత వచ్చే మార్కులే తుది మార్కులు అవుతాయి. అంటే రీ వాల్యుయేషన్ లో మార్కులు తగ్గితే అవే ఫైనల్ అవుతాయి. 

Also read: AP Inter Updates: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Trending News