AP Inter Exams: ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144

AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకు జరగనున్న పరీక్షల్లో మొత్తం 10.58 లక్షల మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 1, 2025, 09:05 AM IST
AP Inter Exams: ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144

AP Inter Exams: ఏపీలో ఇప్పుడు పరీక్షల సమయం. ఇవాళ్టి నుంచి మార్చ్ 15 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తరువాత పదో తరగతి పరీక్షలు మొదలవుతాయి. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా సెక్షన్ 144 విధించారు. 

Add Zee News as a Preferred Source

ఏపీలో ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1535 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 10.58 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసిన అధికారులు ఆన్‌లైన్ ద్వారా నిఘా పెడుతున్నారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్ జోన్‌గా ప్రకటించారు. పరీక్ష హాలులో ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, సిబ్బంది వద్ద కూడా ఫోన్‌కు అనుమతి లేదు. సమాచారం కోసం కేవలం చీఫ్ సూపరింటెండెంట్ వద్ద మాత్రమే కీ ప్యాడ్ ఫోన్ ఉంటుంది. రోజు ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. కట్టుదిట్టమైన ఏర్పాట్లలో భాగంగా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 విధించారు. 

ఇంటర్ పరీక్షలకు మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 10 లక్షల 58 వేల 892 మంది విద్యార్ధులు రాస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ షాపులు, ఇంటర్‌నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్ధులను అనుమతిస్తారు. అదే సమయంలో ఓఎంఆర్ షీట్లు అందిస్తారు. 

Also read: NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పు.. ఇకపై అది కుదరదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News