AP Inter Results: వాట్సప్ ద్వారా ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు

AP Inter Results: ఇంటర్మీడియట్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి ఇంటర్ ఫలితాలు వాట్సప్ ద్వారా విడుదల చేయనుంది ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 1, 2025, 02:32 PM IST
AP Inter Results: వాట్సప్ ద్వారా ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు

AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పూర్తయి 15 రోజులవుతోంది. మార్చ్ 1 నుంచి మార్చ్ 15 వరకూ ఈ పరీక్షలు పూర్తి కాగా వ్యాల్యుయేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈసారి గతానికి భిన్నంగా వాట్సప్ ద్వారా ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. 

Add Zee News as a Preferred Source

ఏపీ ఇంటర్ పరీక్షలు 2025 ఫలితాల కోసం విద్యార్ధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చ్ 15కు పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఏప్రిల్ 6 వరకూ ఈ ప్రక్రియ జరగనుంది. ఆ తరువాత మార్కుల కంప్యూటరీకరణ జరగనుంది. ఇది పూర్తయిన తరువాత అధికారికంగా ఏప్రిల్ 12-15 తేదీల్లో ఫలితాలు విడుదల చేయనున్నారు. ప్రతిసారీ ఆన్‌లైన్ విధానంలో ఫలితాలు వెలువడుతుంటాయి.

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://bieap.apcfss.in/ లో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఈసారి అధికారికంగా వాట్సప్ ద్వారా విడుదల కానున్నాయి. వాట్సప్ ద్వారా మార్కుల మెమో పీడీఎఫ్ రూపంలో ఉంటుంది. 

Also read: School Holidays: విద్యార్ధులకు బంపర్ న్యూస్, ఏప్రిల్‌లో అన్నీ సెలవులే, సమ్మర్ హాలిడేస్ ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News