AP Inter Updates: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే

AP Inter Supplementary Exams 2025 Dates: ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. ఇంటర్ ఫలితాలతో పాటు సప్లిమెంటరీ బెటర్ మెంట్ పరీక్షల తేదీలు కూడా వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2025, 07:05 PM IST
AP Inter Updates: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే

AP Inter Supplementary Exams 2025 Dates: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈసారి ఇంటర్ పరీక్షలకు 10,17,102 మంది హాజరు కాగా మొదటి ఏడాదిలో 70 శాతం, రెండో ఏడాదిలో 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సప్లిమెంటరీ పరీక్షల తేదీల్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. 

Add Zee News as a Preferred Source

ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 17 వేల 102 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి ఏడాదిలో 70 శాతం ఉత్తీర్ణత లభిస్తే రెండో ఏడాదిలో 83 శాతం లభించింది మొదటి ఏడాదిలో బాలికల్లో ఉత్తీర్ణత 71 శాతం ఉంటే బాలుర ఉత్తీర్ణత 64 శాతంగా నమోదైంది. ఇక రెండో ఏడాదిలో బాలికల ఉత్తీర్ణత 81 శాతమైతే బాలుర ఉత్తీర్ణత 75 శాతం ఉంది. వృత్తి విద్యా కోర్సుల్లో 71 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ ఉత్తీర్ణత నమోదైనట్టు ఇంటర్ బోర్డ్ తెలిపింది. 

మే 12 నుంచి మే 20 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలతో పాటు మొదటి ఏడాది బెటర్ మెంట్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 22 వరకూ ఫీజులు చెల్లించేందుకు గడువు ఉంది. మే 12 నుంచి మే 20 వరకూ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ, తిరిగి మద్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 

Also read: Permit Rooms: ఏపీలో మందుబాబులకు ఇకపై పుల్ జోష్, కొత్తగా పర్మిట్ రూమ్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Trending News