)
AP Mega DSC 2025 Results: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే ప్రభుత్వం మెగా డీఎస్సీని నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే హామీ ప్రకారం భారీ పోస్టులతో డీఎస్సీ ప్రకటించాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం తక్కువ పోస్టులతో ఇచ్చింది. ఏదో ఒకటి ప్రకటన విడుదలైందని అభ్యర్థులు ఉన్న తక్కువ పోస్టుల్లోనే తమ అదృష్టం పరీక్షించుకోవడానికి పరీక్షలు రాశారు. మరి పరీక్ష ఫలితాలు ఎప్పుడూ విడుదలవుతాయో తెలుసుకుందాం.
మెగా డీఎస్సీ-2025 ఫలితాలను ఈ నెల 15వ తేదీలోగా అంటే స్వాతంత్ర దినోత్సవ కానుకగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15వ తేదీలోపు పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫలితాలు విడుదల చేసిన వెంటనే సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈనెల 16వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
క్రీడా కోటాలో 421 టీచర్ పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) నుంచి రాలేదు. ప్రస్తుతానికి ఈ పోస్టుల భర్తీపై స్పష్టత రాలేదు. శాప్ నుంచి వివరాలు రాగానే జిల్లాల్లో కటాఫ్ మార్కులు ప్రకటించనుంది. ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. మొత్తం ప్రక్రియను చకాచకా పూర్తి చేసి నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది.
కొత్తగా వచ్చే 16,347 మంది ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని విద్యా శాఖ భావిస్తోంది. పోస్టింగ్‌లకు ముందే ఈ శిక్షణ పూర్తి చేస్తారు. కానీ విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రభుత్వం వెంటనే పోస్టింగ్‌లు ఇచ్చేసి తర్వాత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడడంతో నాలుగైదు శని, ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ చొరవ చూస్తుంటే సెప్టెంబర్ తొలి వారం నుంచే కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.