AP Mega DSC Notification 2025: మెగా డీఎస్సీ ఎలా అప్లై చేయాలి, వయసు, విద్యార్హత ఏంటి పూర్తి వివరాలు

AP Mega DSC Notification 2025: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ దాదాపు ఏడాది తరువాత ఎట్టకేలకు విడుదలైంది. ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2025, 07:38 PM IST
AP Mega DSC Notification 2025: మెగా డీఎస్సీ  ఎలా అప్లై చేయాలి, వయసు, విద్యార్హత ఏంటి పూర్తి వివరాలు

AP Mega DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే గత ఏడాది నోటిఫికేషన్ అప్లై చేసుకున్నవారి పరిస్థితి ఏంటి, ఇప్పుడు మళ్లీ అప్లై చేయాలా, ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందా అనే సందేహాలు నెలకొన్నాయి. 

Add Zee News as a Preferred Source

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలో రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు. కానీ అప్పటి నుంచి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో విద్యార్ధులు చాలా నిరాశ చెందారు. ఎట్టకేలకు 16,347 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వచ్చేసింది. నిన్న ఆదివారం ఏప్రిల్ 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన ఆభ్యర్ధులు https://apdsc.apcfss.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గత ఏడాది ఎన్నికల కంటే ముందు అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సరిగ్గా పరీక్షలు నిర్వహించే సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా చూపి పరీక్షలు వాయిదా వేశారు. ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ రద్దు చేసింది. మెగా డీఎస్సీలో విలీనం చేస్తున్నామని ప్రకటించింది. 

గత ఏడాది డీఎస్సీ అభ్యర్ధులు మళ్లీ ఫీజు చెల్లించాలా

మరి ఇప్పుడు మెగా డీఎస్సీకు అప్లై చేసేటప్పుడు మళ్లీ ఫీజు చెల్లించాలా లేదా అనే సందేహం నెలకొంది విద్యార్ధులకు. గత ఏడాది అప్పటి ప్రభుత్వం 6100 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో అప్లై చేసిన విద్యార్ధులు మెగా డీఎస్సీకు మళ్లీ అప్లై చేయాల్సి ఉంటుంది కానీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పుడు దరఖాస్తు చేసుకున్నదానికంటే ఎక్కువ సబ్జెక్టులు లేదా పోస్టులు ఎంచుకుంటే మాత్రం ఒక్కో పోస్టుకు 750 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

డీఎస్సీకు టెట్ అర్హత మార్కులు ఎన్ని, ఎలా అప్లై చేయాలి

ఓసీ అభ్యర్ధులకు టెట్‌లో 90 మార్కులు, బీసీ కేటగరీ విద్యార్ధులకు 75 మార్కులు, ఎస్సీ-ఎస్టీ, దివ్యాంగ కేటగరీ విద్యార్ధులకు 60 మార్కులు టెట్‌లో రావల్సి ఉంటుంది. అప్పుడే డీఎస్సీ రాసేందుకు అర్హులవుతారు. మెగా డీఎస్సీలో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వ్యక్గిగత వివరాలు, రెండవ విభాగంలో విద్యార్ఙతలు, పోస్టుల వివరాలు ఉంటాయి. ఇక మూడో విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలుంటాయి. మొదటి రెండు విభాగాల్లో అంశాల్ని ఎన్ని సార్లయినా ఎడిట్ చేసుకునేందుకు వీలుంటుంది. పూర్తిగా ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తరువాతే అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. అభ్యర్ధి విద్యార్ఙతల్ని బట్టి ఏయే పోస్టులకు అర్హులనేది సాఫ్ట్‌వేర్ ద్వారా తెలుస్తుంది. ఒకసారి ప్రాధాన్యతా క్రమం ఎంపిక చేసుకుంటే తిరిగి మార్చుకునేందుకు వీలుండదు. 

అభ్యర్ధి ఎంపిక చేసుకున్న మొదటి పోస్టుకు ఎంపిక కాకుంటే రెండవ ఆప్షన్‌కు బదిలీ అవుతుంది. రెండోది కూడా రాకపోతూ మూడోదానికి మారుతుంది. మొదటి ఆప్షన్‌కు ఎంపికైతే మిగిలినవి రద్దవుతాయి. ఒకసారి ఒక పోస్టుకు ఎంపికైన తరువాత మార్చుకునేందుకు అవకాశం ఉండదు. 

మెగా డీఎస్సీ వయో పరిమితి

జూలై 1, 2024 నాటికి అభ్యర్ధుల వయస్సు 18 కంటే తక్కువ 44 కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వేషన్ కేటగరీ అయితే గరిష్టంగా 49 ఏళ్లుండాలి. దివ్యాంగులకు గరిష్టంగా 54 ఏళ్లు ఉండవచ్చు. షెడ్యూల్ కులాల వర్గీకరణకై విడుదల చేసిన జీవో నెంబర్ 7 ప్రకారం గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 విభాగాలుగా నిర్ధారిత శాతం రిజర్వేషన్ ఉంటుంది. స్పోర్ట్స్ కోటా 3 శాతం ఉంటుంది. 

Also ReadJEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఎప్పటి వరకంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News