Amaravati Capital Construction Works: 64 వేల కోట్లతో మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి

Amaravati Capital Construction Works: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 64 వేల కోట్లతో  నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2025, 07:31 PM IST
Amaravati Capital Construction Works: 64 వేల కోట్లతో మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి

Amaravati Capital Construction Works: ఏపీ రాజధాని అమరావతిలో 64,721 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాజధాని నిర్మాణ పనుల కోసం మల్టీ లెవెల్ ఏజెన్సీలు, భూముల విక్రయాలు, లీజు ద్వారా నిధులు సమకూరుస్తామన్నారు. 

Add Zee News as a Preferred Source

అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మౌళిక సదుపాయాల కల్పనకు 64,721 కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నిధుల్ని మల్టీ లెవెల్ ఏజెన్సీలు, బ్యాంకు రుణాలు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ ద్వారా సేకరిస్తున్నామని వివరించారు. రైతులు అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విధానపరమైన అనిశ్చితి కారణంగా రాజధాని నిర్మాణ ప్రక్రియ ఆలస్యమైందన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిగా తీర్చిదిద్దేందుకు డిజైన్ చేయించారన్నారు. 

అమరావతి నిర్మాణ ఖర్చులో ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలిసి 13,400 కోట్ల రుణం అందిస్తున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు మరో 5 వేల కోట్ల రుణం ఇస్తోందని చెప్పారు. హడ్కో నుంచి 11000 కోట్లు మరో 2-3 రోజుల్లో వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1560 కోట్ల గ్రాంట్ వస్తుందన్నారు. ఇక అమరావతిలోని భూములు విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో తక్కువ వడ్డీ రుణాలు ఇలా వివిధ పద్ధతుల్లో నిధులు సమీకరిస్తామన్నారు. ప్రస్తుతం అమరావతిలో 106 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. 

అమరావతిలో మెయిన్ రోడ్లు 165-185 అడుగులతో రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఎల్పీఎస్ రోడ్లను మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. సగానికి పైగా నిర్మాణం జరిగి ఆగిపోయినవాటిని ఏడాదిన్నర వ్యవధిలోనూ, మిగిలినవి రెండేళ్ల వ్యవధిలోనూ పూర్తి కానున్నాయి. ఇక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. 2014-19 మధ్యకాలంలో అమరావతిలో 131 సంస్థలకు 1277 ఎకరాలు కేటాయించగా వాటిలో కొన్ని సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. వాటిలో 31 సంస్థలకు 629.3 ఎకరాలు కొనసాగించనున్నారు. రెండు సంస్థలకు మాత్రం 5.5 ఎకరాలు మరో ప్రాంతంలో కేటాయిస్తామని వివరించారు. అదే సమయంలో 13 సంస్థలకు గతంలో ఇచ్చిన 177.24 ఎకరాలను రద్దు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఆర్ 5 జోన్‌లో 50 వేల మంది పేదలకు ఇచ్చిన భూముల్ని తీసుకుని వేరే ప్రాంతంలో కేటాయిస్తామన్నారు. 

Also read: Gold Rate Today: బంగారం ప్రియులకు ఊరట, స్వల్పంగానే పెరిగిన బంగారం ధర, ఏ నగరంలో ఎంత ధర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News