MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆశావహులు ఎవరు

MLC Elections: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 స్థానాల్లో జనసేనకు ఇప్పటికే ఒక సీటు ఖరారు కాగా మిగిలిన 4 సీట్ల కోసం చాలామంది ఆశావహులు పోటీలో ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 25, 2025, 12:09 PM IST
MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆశావహులు ఎవరు

MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఓ వైపు టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సమీపించింది. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమిలోని మూడు పార్టీలు పోటీ పడనున్నాయి. 

Add Zee News as a Preferred Source

ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, తిరుమల నాయుడు పదవీకాలం మార్చ్ 29తో ముగియనుంది. ప్రస్తుతం సంఖ్యాపరంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు బలం లేకపోవడంతో మొత్తం ఐదు స్థానాలు కూటమి పార్టీల ఖాతాలోనే పడనున్నాయి. ఈ ఐదు స్థానాల్లో జనసేన, బీజేపీ నుంచి ఒక్కొక్కరు, తెలుగుదేశం నుంచి ముగ్గురు పదవి ఆశిస్తున్నారు. జనసేన నుంచి నాగబాబు పేరు దాదాపుగా ఖరారైంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు విన్పిస్తున్నా ఇంకా స్పష్టత రాలేదు. తెలుగుదేశం నుంచి మాత్రం మూడు స్థానాలకు ఆశావహులు చాలామంది సిద్ధంగా ఉన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్

మార్చ్ 3 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
మార్చ్ 10 నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ
మార్చ్ 11నామినేషన్ల పరిశీలన
మార్చ్ 13 నామినేషన్ల ఉపసంహరణ
మార్చ్ 20 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు
మార్చ్ 20 సాయంత్రం ఓట్ల లెక్కింపు

Also read: SLBC Tunnel Collapse: 72 గంటలు..అసలు బతికి ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News