AP MLC Elections: ఏపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల్ని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

AP MLC Elections: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఏపీలో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి జనసేనకు ఖరారు కాగా మిగిలిన నాలుగింటిలో ముగ్గురి పేర్లను తెలుగుదేశం ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2025, 08:04 PM IST
AP MLC Elections: ఏపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల్ని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీల అభ్యర్ధులు దాదాపుగా ఖరారయ్యారు. మొత్తం ఐదు ఖాళీల్లో ఒకటి జనసేన తరపున మెగా బ్రదర్ నాగబాబుకు కేటాయించగా మిగిలిన నాలుగు సీట్లలో మూడింట తెలుగుదేశం పోటీ చేస్తోంది. ఐదవ సీటను బీజేపీకు కేటాయించారు. 

Add Zee News as a Preferred Source

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఐదింట ఒక స్థానాన్ని ఇప్పటికే జనసేనకు కేటాయించగా ఆ పార్టీ తరపున మెగా బ్రదర్ నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇక చివరి నిమిషంలో మరో సీటును బీజేపీకు కేటాయించింది తెలుగుదేశం పార్టీ. ఇక మూడు స్థానాల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. దాదాపు 25 మంది బరిలో నిలిచినట్టు తెలుస్తోంది. అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ ద్వారా ఎవరికివారు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. భారీ చర్చలు, సంప్రదింపుల అనంతరం తెలుగుదేశం పార్టీ ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 

వాస్తవానికి నాలుగో స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీనే పోటీ చేయాల్సింది. కానీ చివరి నిమిషంలో ఈ సీటును బీజేపీకు కేటాయించారు. అటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో అభ్యర్ధుల్ని ఖరారు చేసి నాలుగో స్థానాన్ని సీపీఐకు కేటాయించింది. 

Also read: Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు, ఊహించని విధంగా విజయశాంతి పేరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News