AP MLC Counting: ఏపీలో ఎమ్మెల్సీ కౌంటింగ్.. గెలుపు వారిదే..

AP MLC Counting: తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో గత నెల 27న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో మాదిరి ఇక్కడ పెద్దగా ఉత్కంఠ అయితే లేదు. వార్ వన్ సైడ్ అన్నట్టుగానే ఉంది. మొత్తంగా రెండు గ్రాడ్యుయేట్స్.. ఒక ఉపాధ్యాయ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కాసేపటి క్రితమే మొదలైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 3, 2025, 08:34 AM IST
AP MLC Counting: ఏపీలో ఎమ్మెల్సీ కౌంటింగ్.. గెలుపు వారిదే..

AP MLC Counting:APలో  రెండు గ్రాడ్యుయేట్‌, ఒక ఉపాధ్యాయ MLC  స్థానాలకు  జరిగిన ఎన్నిక కౌంటింగ్‌  ప్రారంభం అయింది.   ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గత నెల 27న  ఎన్నికలు జరిగాయి.

Add Zee News as a Preferred Source

రెండు పట్టభద్రుల స్థానాల్లో తెలుగు దేశం  నాయకులతోపాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో ఏపీటీఎఫ్‌ అభ్యర్థి రఘువర్మకు భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం, జనసేన కు చెందిన కూటమి మద్దతు ప్రకటించింది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఈ నేపథ్యంలో మూడు స్థానాల్లోనూ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపించింది. కాగా కౌంటింగ్‌కు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే.. తెలంగాణలో బీఆర్ఎస్ మాదిరే ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ అస్త్ర సన్యాసం చేయడంతో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిపోనుంది. ఈ ఎన్నికల ఫలితాలతో కూటమికి మండలిలో మూడు స్థానాలు దగ్గబోతున్నాయి.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News