)
AP New Districts with Assembly Constituencies: ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 23 జిల్లాలు ఉండేవి. అందులో తెలంగాణలో 10 జిల్లాలు.. రాయలసీమల 4 జిల్లాలు.. ఆంధ్ర ప్రాంతంలో 9 జిల్లాలుండేవి.ఇక 294 అసెంబ్లీ నియోజవర్గాలుండేవి. 2014లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విడిపోయింది. ఇక తెలంగాణలో 10 జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం 36 జిల్లాలుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ విభజించారు. అటు ఏపీలోని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కొత్త రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రాన్ని చక్కదిద్దే బిజీలో ఉండిపోయారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ఏపీలోని 13 జిల్లాలను 25 పార్లమెంట్ నియోజకవర్గాలను బేస్ చేసుకొని 26 జిల్లాలుగా విభజించారు. అయితే గత ప్రభుత్వం ఈ విభజనను అశాస్త్రీయంగా చేసిందనేది కూటమి ప్రభుత్వం చేస్తోన్న వాదన. దీంతో ఇపుడు 26 జిల్లాలను పునర్వస్తీకరిస్తూ కొత్తగా 32 జిల్లాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందులో ఒక్కో జిల్లాలోల కనీసం మూడు, నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలుగా వచ్చేలా విభజించారు.
ఏపీలో కొత్త (ప్రతిపాదిత) జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు వివరాలు ఇలా ఉన్నాయి.
1. పలాస జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేలా విభజన చేశారు.
2. శ్రీకాకుళం జిల్లాలో.. శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం శాసనసభ నియోజకవర్గాలున్నాయి.
3. మన్యం పార్వతీపురం జిల్లాలో: పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ ఉండేలా కొత్త జిల్లాను రూపకల్పన చేశారు.
4. విజయనగరం జిల్లాలో: విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి నియోజకవర్గాలు.
5. విశాఖపట్నం జిల్లాలో:భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు.
6. అల్లూరి సీతారామరాజు అరకు జిల్లాలో: అరకు, పాడేరు, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలు.
7. అనకాపల్లి జిల్లాలో: అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని నియోజకవర్గాలు వచ్చేలా విభజించారు.
8. కాకినాడ జిల్లాలో: కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాలు వచ్చేలా విభజన చేశారు.
9. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం జిల్లాలో: రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలు..
10. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లాలో : అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట
11.పశ్చిమ గోదావరి నరసాపురం జిల్లాలో:*తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు..
12. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు: ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం శాసనసభ స్థానాలు..
13. కృష్ణా మచిలీపట్నం జిల్లాలో:కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు శాసనసభ స్థానాలు..
14. ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలో.. విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం శాసనసభ స్థానాలు..
15.అమరావతి: పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి,జగ్గయ్యపేట,నందిగామ అసెంబ్లీ నియోజకవర్గాలు..
1 గుంటూరు: గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలు..
17. బాపట్ల: బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గాలు..
18. పల్నాడు నరసరావుపేట: నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు..
19.మార్కాపురం జిల్లాలో: మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాలు..
20. ఒంగోలుజిల్లాలో:ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు..
21.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో: నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావాలి, కోవూరు, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు..
22. గూడూరు జిల్లాలో: గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు..
23. శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలో: తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు..
24. చిత్తూరు జిల్లాలో.. చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు..
25.మదనపల్లి జిల్లాలో: మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు..
26.సత్యసాయి హిందూపురం.. హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గాలు..
27. అనంతపురం జిల్లాలో.. అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు..
28. ఆదోని జిల్లాలో :ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాలు..
29. కర్నూలు జిల్లాలో:కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు శాసనసభ స్థానాలు..
30.నంద్యాల జిల్లాలో: నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం శాసనసభ స్థానాలు..
31.వైఎస్సార్ కడప జిల్లాలో: కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల శాసనసభ స్థానాలు..
32.అన్నమయ్య రాజంపేట జిల్లాలో: రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు శాసనసభ స్థానాలుగా విభజించారు. ఈ కొత్త జిల్లాలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకు రావాలని చూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.