Harsha Kumar on Ys Jagan: అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం జగన్‌ను చూసి భయపడుతోందని అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమౌతున్నాయి.
ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ప్రతిపక్ష హోదా మరోసారి చర్చనీయాంశమైంది. తొలిరోజు సభకు సమావేశమైన జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలు హోదా కోసం నినాదాలిస్తూ బాయ్‌కాట్ చేసి వచ్చేశారు. ఇక అప్పటి నుంచి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరుగుతోంది. వైఎస్ జగన్‌ను చూసి ప్రభుత్వం భయపడుతోందని అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ హర్షకుమార్ సంచలనం రేపారు. ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు. అయితే గతంలో ఢిల్లీ అసెంబ్లీలో మూడు సీట్లు వచ్చిన బీజేపీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన సంగతిని హర్షకుమార్ గుర్తు చేశారు. అంటే సీట్ల సంఖ్య ప్రాతిపదిక కాదన్నారు.
గ్రూప్ 2 అభ్యర్ధుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. గ్రూప్ 2 విషయంలో ఏ విధంగా డ్రామా ఆడారో చంద్రబాబు ఫోన్ రికార్డింగ్ విడుదల చేశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కంటే చంద్రబాబే గొప్ప నటుడని సెటైర్లు వేశారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రూప్ అభ్యర్ధులు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పించారన్నారు.
హర్షకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి. వాస్తవానికి హర్షకుమార్ వర్సెస్ వైఎస్ జగన్ మధ్య సఖ్యత లేదు. వైఎస్ఆర్‌తో ఉన్న విబేధాలే ఆ తరువాత కొనసాగాయి. మధ్యలో వైసీపీలో చేరేందుకు హర్షకుమార్ ప్రయత్నించినా జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదని సమాచారం. ఆ తరువాత హర్షకుమార్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ మాజీ కాంగ్రెస్ నేతలపై దృష్టి సారించారు. త్వరలో హర్షకుమార్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో హర్షకుమార్ జగన్ మద్దతుగా వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీస్తోంది.
Also read: TG Inter Hall Tickets: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









