TDP Silent: జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం మౌనం చాలా ఆశ్చర్యం కల్గిస్తోంది. పార్టీ గురించి ఎవరు ఏమన్నా విరుచుకుపడేందుకు సిద్దంగా ఉండే తెలుగు తమ్ముళ్లు ఈసారెందుకో నోరు విప్పలేకున్నారు. మెగా సోదరులు ఇద్దరూ అంతంత మాటలన్నా ఎవరూ స్పందించలేకున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మంటూ నాగబాబు చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే మరో మెట్టు ఎక్కువే ఉన్నారు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని గట్టెక్కించింది, కాపాడింది తామేనని బహిరంగంగా చెప్పినా తెలుగు తమ్ముళ్లు లేదా పార్టీ కీలక నేతలు నోరు విప్పడం లేదు. తెలుగుదేశం పార్టీని తామే అధికారంలో తీసుకొచ్చామని చెప్పడం వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసహనాన్ని కల్గించాయి. కానీ ఎందుకో పైకి మాట్లాడలేకపోతున్నారు. గట్టిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి లేదు. అసలు జనసేన సహకారం లేకపోయినా తాము అధికారం వచ్చి ఉండేవాళ్లమని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్న తరుణంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా మౌనమే సమాధానమైంది.
ఏపీలో హోంశాఖ మంత్రి అసమర్థత గురించి మాట్లాడినప్పుడు లేదా తిరుపతి లడ్డూ వ్యవహారంలో టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరడం లేదా సనాతన అవతారంతో టీడీపీని డిఫెన్స్‌లో నెట్టడం ఇలా ఇప్పటికే వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతోంది తెలుగుదేశం పార్టీ. అయినా టీడీపీ అధిష్టానం నోరెత్తలేదు. ఎవరినీ ఈ విషయాలపై మాట్లాడవద్దని పైనుంచి ఆదేశాలు అందాయి. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. పార్టీని కాపాడింది తామేనని చెప్పినా ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. కారణం తెలుగుదేశం అధిష్టానం నుంచి ఆ దిశగా స్పష్టమైన సందేశాలు ఉన్నాయి.
తెలుగుదేశం ఎందుకు మౌనంగా ఉంది
పార్టీ గురించి లేదా పార్టీలో నేతల గురించి తక్కువ చేస్తూ మాట్లాడినా తెలుగుదేశం అధిష్టానం మౌనంగా ఉండటానికి కారణం కేంద్రంలోని మిత్రపక్షం బీజేపీ అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో ఆ పార్టీకు ప్రస్తుతం మంచి బంధం నడుస్తోంది. కూటమిలో మూడు పార్టీలు చేరేందుకు కారణం కూడా పవన్ కళ్యాణే అని తెలుస్తోంది. పవన్ లేదా బీజేపీని నొప్పిస్తే రాష్ట్రంలో అమరావతి, పోలవరం నిర్మాణ పనులకు నిధుల రాకలో ఇబ్బంది రావచ్చనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఇప్పటికే ఇచ్చిన హామీలకు నిధులు ఎక్కడి నుంచి సమీకరించాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్న ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కొత్తగా మిత్రపక్షాల నుంచి తలనొప్పులు తెచ్చుకోవడం ఇష్టం లేనట్టుంది. అందుకే ఎలాంటి విమర్శలు చేయవద్దని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. అందుకే టీడీపీ మౌనం వహిస్తోంది.
Also read: Actor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









