AP Rain Alert: అల్ప పీడన ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు,మెరుపులతో వర్షాలు పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఈ క్రమంలోనే చెట్ల క్రింద ఉండవద్దంటూ హైచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది దక్షిణ తమిళనాడు తీరం మీదుగా కూడా వ్యాపించి ఉంది.
మరో ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలో 3.1 కి.మీ ఎత్తులో ఉంది. ఈ రెండు ఆవర్తనాలు కలిసిపోయాయి. వీటి ప్రభావంతో ఏపీలో వానలు కురుస్తున్నాయి. మరోవైపు మరో మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈలోగా, నేడు , రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది.
దేశంలోని పలు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు వేగంగా వెనక్కి వెళ్తున్నాయి. తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి సోమ, మంగళవారాల్లో నైరుతి నిష్క్రమించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో AP నుంచి కూడా నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read more: గోవా నుంచి మన రాష్ట్రానికి ఎంత మద్యం తీసుకురావచ్చో తెలుసా..! చట్టం ఏం చెబుతోందంటే..
Read more: మన దేశంలో అత్యంత సంపన్న మంత్రులు వీళ్లే.. లిస్టులో తెలుగు వాళ్లే టాప్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









