AB venkateswara rao: జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, త్వరలో రాజకీయాల్లో ఎంట్రీ

AB venkateswara rao: తెలుగుదేశం పార్టీ విదేయుడిగా ముద్రపడిన మాజీ ఐపీఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నానని స్పష్టం చేసిన ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2025, 07:44 PM IST
AB venkateswara rao: జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, త్వరలో రాజకీయాల్లో ఎంట్రీ

AB venkateswara rao: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక తన మిగిలిన జీవితం రాజకీయాల్లో వచ్చి ప్రజా సేవ చేయడమేనన్నారు. 

Add Zee News as a Preferred Source

ఆంద్రప్రదేశ్ పోలీసు అధికారుల్లో తెలుగుదేశం విధేయడిగా ముద్రపడిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అమలాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఇకపై రాజకీయాల్లోకి వచ్చి సమాజం కోసం పనిచేస్తానన్నారు. తన జీవితంలో కాళ్లు చేతులు ఆడినంతకాలం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. రాజకీయాలంటే పదవులు, అధికారం కానేకాదని, సమాజంలోని స్థితిగతుల్ని తెలుసుకుని జరుగుతున్న తప్పుల్ని సిరదిద్దాలని చెప్పారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రానికి పొంచి ఉన్న అతి పెద్ద ఉపద్రవం వైఎస్ జగన్ అని ఏబీ వెంకటేశ్వరరావు అభివర్ణించారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంతటి విధ్వంసాన్ని చవిచూసిందో అందరికీ తెలుసన్నారు. ప్రజాస్వామ్య విలువలపై జగన్ కు ఎలాంటి గౌరవం లేదన్నారు. నిత్యం అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యాకాండలతో భయపెట్టారన్నారు. అంతేకాకుండా జగన్ కు ఏకంగా మోసగాడుగా చెప్పారు. ఇతరుల గురించి ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడటం జగన్ నైజమన్నారు. కులాలు, మతాల పేరుతో ప్రజల్ని విడదీసి లబ్ది పొందాలనేదే జగన్ నైజమన్నారు. అందుకే జగన్ తో ఉన్న నేతల్ని ప్రజలు దూరం చేయాలని పిలుపునిచ్చారు. 

Also read: Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మరో రెండు రోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Trending News