SC Corporation Loans: నిరుపేద ఎస్సీలకు గుడ్‌న్యూస్, సబ్సిడీ రుణాలకు ఇలా అప్లై చేసుకోండి

SC Corporation Loans: ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేద దళితులకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం ఎస్సీలకు సబ్సిడీ రుణాలు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎస్సీ రుణాలకు ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2025, 07:31 PM IST
SC Corporation Loans: నిరుపేద ఎస్సీలకు గుడ్‌న్యూస్, సబ్సిడీ రుణాలకు ఇలా అప్లై చేసుకోండి

SC Corporation Loans: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు పెట్టుకునేందుకు సబ్సిడీ రుణాలు అందించనుంది. అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 11 నుంచి ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలు ఇలా ఉన్నాయి. 

Add Zee News as a Preferred Source

ఏపీ ఎస్సీ కార్పొరేషన్ రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 11 నుంచి ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. మే 10 వరకూ అప్లై చేసుకోవచ్చు. సొంతంగా ఉపాధి పొందేందుకు లేదా ఏదైనా వ్యాపారం పెట్టుకునేందుకు రుణాలు తీసుకోవచ్చు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, రవాణా, కుటీర పరిశ్రమలు, సేవా, వ్యాపార రంగాల్లో స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుంది. ఈ రుణాలపై సబ్సిడీ ఉంటుంది. ఎస్సీ వర్గానికి చెంది బీపీఎల్ కేటగరీలో ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడై ఉండి 21-50 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రవాణా రంగం ఎంచుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉడాలి. డీపార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చేసే వ్యాపారాన్ని బట్టి ఇతర అర్హతలు ఆధారపడి ఉంటాయి. ఆసక్తి కలిగిన అర్హత ఉన్న అభ్యర్ధులు నేరుగా https://apobmms.apcfs.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వర్మ కంపోస్ట్ సేంద్రీయ ఎరువుల తయారీ, పూల బొకేలు, డెకొరేషన్ వ్యాపారం పెట్టుకునేందుకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. వెబ్‌సైట్ అభివృద్ధి, ఐటీ సేవలు, కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ వంటి రంగాలైతే ఐటీఐ, డిప్లొమా అర్హత ఉండాలి. ఇక ఎల్ఈడీ బల్బులు, ఎనర్జీ సేవింగ్ డివైస్ అసెంబ్లింగ్ పెట్టుకునేందుకు ఐటీఐ డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ , మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఇలా దాదాపుగా 30-40 స్వయం ఉపాధి రంగాల కోసం రుణాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ సబ్సిడీ రుణాలకు ఎలా అప్లై చేయాలి

ముందుగా https://apobmms.apcfs.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేయాలి. యూజర్ ఐడీ, రిజిస్ట్రేషన్ కోసం నమోదు చేసిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. అప్లికేషన్‌లో మొత్తం వివరాలు ఎంటర్ చేసి సంబంధిత పత్రాలు అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ చేయాలి. చివరిగా సబ్‌మిట్ చేసిన అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి. అప్లికేషన్ స్క్రూటినీ పూర్తయ్యాక సంబంధిత అధికారులు వచ్చి పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే రుణం మంజూరు చేస్తారు. మీరు చేసే వ్యాపారాన్ని బట్టి సబ్సిడీ 35 శాతం నుంచి 50 శాతం వరకూ అందుతుంది. 

Also read: New Toll System: వాహనదారులకు గుడ్‌న్యూస్, ఇకపై కొత్త టోల్ విధానం, ఎలా పని చేస్తుందంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News