Murder and Suicide: కాకినాడలో మహా ఘోరం, చదువు కోసం పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Murder and Suicide: కాకినాడలో అత్యంత ఘోరం జరిగిపోయింది. మాటల్లో చెప్పలేని విషాదం. ఓ కర్కశుడైన తండ్రి చేసిన నిర్వాకం. ఎల్కేజీ చదువులతోనే పోటీ ప్రపంచాన్ని పోల్చి చూసుకున్న అన్‌మెచ్యూర్డ్ తండ్రి చేసిన దురాగతమిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 15, 2025, 04:29 PM IST
Murder and Suicide: కాకినాడలో మహా ఘోరం, చదువు కోసం పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Murder and Suicide: పోటీ ప్రపంచంలో బతకలేరని ముందే నిర్ధారణకు వచ్చేశాడు ఓ తండ్రి. హోలీ నాడు ఇద్దరు చిన్నారుల్ని కడతేర్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత సంచలనంగా మారింది. 

Add Zee News as a Preferred Source

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ ఓఎన్డీజీలో అసిస్టెంట్ ఎక్కౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. భార్య తనూజ, ఇద్దరు పిల్లలు జోషిత (7), నిఖిల్ ( 6) ఉన్నారు. కాకినాడ తోట సుబ్బారావు నగర్‌లోని ఓ అపార్ట్మెంట్‌లో ఉంటున్నాడు. హోలీ వేడుకలకు కుటుంబంతో సహా ఆఫీసుకు వెళ్లాడు. అందరూ వేడుకల్లో ఉండగా భార్యను అక్కడే ఉండమని, పిల్లలకు టైలర్ దగ్గర కొలతలు తీయించి 10 నిమిషాల్లో వస్తానని చెప్పి ఇంటికొచ్చేశాడు. ఆ చిన్నారులిద్దరి కాళ్లుచేతులు కట్టి బాత్‌రూం బకెట్లలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తరువాత బెడ్ రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్ చేసిన స్పందించకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికొచ్చింది. కిటికీలోంచి చూడగా భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నాడు. తలుపులు బద్దలు కొట్టి చూస్తే పిల్లలు బకెట్‌లో తలలు మునిగి చనిపోయున్నారు. ఈ భయంకర దృశ్యం చూసిన ఆమె ఆక్కడే కుప్పకూలిపోయింది. 

ఇంట్లో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. తనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇళ్లు, మంచి కుటుంబం ఉన్నా సరే పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని, భవిష్యత్తు లేదని లేఖలో రాశాడు. అందుకే తాను పిల్లల్ని చంపి తానూ చనిపోతున్నట్టు రాసుకున్నాడు. పిల్లల చదువు కోసం ఈ మధ్యనే స్కూలు కూడా మార్చినట్టు బంధువులు చెప్పారు. ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని బంధుమిత్రులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

కేవలం ఎల్కేజీ, 1వ తరగతి మార్కులకే పోటీ ప్రంపంచంతో పోల్చి చూసిన ఆ తండ్రి మానసిక స్థితిని చూసి ఏమనాలో అర్ధం కాని పరిస్థితి. ఏబీసీడీలు నేర్చుకునే దశలో పిల్లల భవిష్యత్ అంచనా వేసి చంపేందుకు ఆ తండ్రికి మనసెలా వచ్చిందనేది ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. 

Also read: Pawan Kalyan: పవన్ నోట జై తెలంగాణ నినాదాలు, ఏపీ హిట్ ఫార్ములా అమలు చేయనున్నారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News