AP Speaker: వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాపై ప్రకటన, క్షమించి వదిలేస్తున్నాం

AP Speaker: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌ను క్షమించి వదిలేస్తున్నానని చెప్పారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 5, 2025, 12:36 PM IST
AP Speaker: వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాపై ప్రకటన, క్షమించి వదిలేస్తున్నాం

AP Speaker: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. 

Add Zee News as a Preferred Source

ఏపీ అసెంబ్లీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై మాట్లాడారు. ప్రతిపక్ష హోదా అంశంపై జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఎంతటివారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడమంటే సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. సంధి ప్రేలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నామన్నారు. తప్పుడు ప్రచారానికి తెర దించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 

ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ కోర్టుకు వెళ్లి ప్రతిపక్ష నేతగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారన్నారు. వైఎస్ జగన్ పిటీషన్ ఇప్పుడు విచారణకు స్వీకరించాలా వద్దా అనే దశలో ఉందన్నారు. తనపై అభియోగాలు మోపుతూ బెదిరిస్తూ గత ఏడాది జూన్ నెలలో జగన్ లేఖ రాశారన్నారు. గతంలో లోక్‌సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష హోదా ఇచ్చారనేది వాస్తవం కాదన్నారు. లోక్‌సభలో తెలుగుదేశం నేతగా మాత్రమే గుర్తించారని చెప్పారు. వైసీపీ అసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. 

నిబంధనల ప్రకారం అసెంబ్లీలో 10 శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. గత ప్రభుత్వంలో 18 సీట్లు కూడా రానివ్వకుండా చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఈ తరహా వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. ఈ వ్యాఖ్యల్ని సభా హక్కుల ఉల్లంఘనగా చూడాల్సి వస్తుందన్నారు. కానీ సంధి ప్రేలాపనలుగా భావించి సభాపతి హోదాలో క్షమిస్తున్నామన్నారు. ఇకపై కూడా ఇలానే అవాస్తవాలు ప్రచారం చేస్తే ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకు రాకుంటే నియోజకవర్గ సమస్యల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అందుకే అసెంబ్లీకు రమ్మని కోరుతున్నానన్నారు. 

Also read: Nagababu As MLC: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా కొణిదెల నాగబాబు పేరు ఖరారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News