AP SSC Results 2025 Out: ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాల తరువాత విద్యార్ధులు ఎదురు చూసిన పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఇవాళ 10 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు మంత్రి నారా లోకేశ్.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో మార్చ్ 17 నుంచి 31 వరకు జరిగిన పదో తరగతి పరీక్షల మూల్యాంకనం, కంప్యూటరీకరణ పూర్తవడంతో ఇవాళ అధికారికంగా ఫలితాలు విడుదల చేశారు. ఏపీ పదో తరగతి ఫలితాలను https://www.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదా ఏపీ ప్రభుత్వం అధికారిక వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా చెక్ చేసుకోవచ్చు. మొత్తం 6 లక్షల 14 వేల 459 మంది పరీక్షలకు హాజరుకాగా 4,98,585 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 81.14 శాతం ఉత్తీర్ణులైనట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో 1680 పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు వచ్చాయి. సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మే 19 నుంచి 28 వరకూ నిర్వహించనున్నారు.
పదో తరగతి ఫలితాలు ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ఓపెన్ చేయండి. అందులో కన్పించే ఎస్ఎస్‌సి రిజల్ట్స్ 2025 లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మీ ఫలితాలు మార్కులతో సహా స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి.
పదో తరగతి ఫలితాలు వాట్సప్ ద్వారా ఎలా తెలుసుకోవడం
ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 9552300009 కు హాయ్ అని టైప్ చేసి పంపించాలి. ఆ తరువాత సర్వీసెస్ విభాగంలో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేయాలి. ఇందులో ఎస్‌ఎస్‌సి రిజల్ట్స్ 2025 క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే చాలు పీడీఎఫ్ రూపంలో మీ మార్కుల మెమో వాట్సప్‌కు వస్తుంది.
? The SSC Public Examinations results for March 2025 have been announced. ?
This year, out of 6,14,459 students who appeared, 4,98,585 have passed, achieving a pass percentage of 81.14%???. I'm delighted to see that Parvathipuram Manyam district has topped the list with an…
— Lokesh Nara (@naralokesh) April 23, 2025
Also read: AP 10th SSC Results 2025 LIVE: టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









