AP SSC Hall Tickets: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP SSC Hall Tickets: పదో తరగతి విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్. ఏపీ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ద్వారా నేరుగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2025, 03:54 PM IST
AP SSC Hall Tickets: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP SSC Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్దమౌతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు పూర్తవుతూనే పదో తరగతి పరీక్షలు ప్రారంభమౌతాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇవాళ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల చేశారు. 

Add Zee News as a Preferred Source

ఏపీలో పదవ తరగతి పరీక్షలు మార్చ్ 17 నుంచి 31 వరకు జరగనున్నాయి. మన మిత్ర వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్  https://bse.ap.gov.in/ ద్వారా హాల్ టికెట్లు సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్ధులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు పుట్టిన తేదీ లేదా ఐడీ, లేదా అప్లికేషన్ నెంబర్ సహాయంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సప్ నెంబర్ నుంచి ముందు హాయ్ అని మెస్సేజ్ పంపించాలి. ఆ తరువాత సర్వీస్ ఎంచుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేస్తే ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ఆప్షన్ కన్పిస్తుంది. అది క్లిక్ చేస్తే చాలు హాల్ టికెట్ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఏపీ పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్

మార్చ్ 17 ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష
మార్చ్ 19 సెకెండ్ లాంగ్వేజ్
మార్చ్ 2 ఇంగ్లీషు
మార్చ్ 22 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
మార్చ్ 24 మేథమేటిక్స్
మార్చ్ 26 ఫిజికల్ సైన్స్
మార్చ్ 28 బయోలాజికల్ సై్స్
మార్చ్ 29 మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2
మార్చ్ 31 లేదా ఏప్రిల్ 1 సోషల్ స్టడీస్

ఇవాళ మద్యాహ్నం 2 గంటల నుంచి హాల్ టికెట్లు సంబంధిత వెబ్ సైట్ లేదా వాట్సప్ ద్వారా పొందవచ్చు.

Also read: AP Summer Effect: రోళ్లు పగిలే ఎండలు, ఏప్రిల్ మేలో హై అలర్ట్ జారీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News