
AP SSC Results 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌తో పాటు ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ ద్వారా ఫలితాలు విడుదల చేయనుంది. ఏపీ పదో తరగతి ఫలితాల తేదీ సమయం ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి. ఆ తరువాత ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ జరుగగా ఇప్పుడు మార్కుల కంప్యూటరీకరణ జరుగుతోంది. ఈ ప్రక్రియ మరో మూడ్రోజుల్లో పూర్తి కానుంది. ఆ తరువాత అంటే ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు అధికారికంగా పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఏపీ పదో తరగతి లేదా ఎస్ఎస్సి ఫలితాలను ఎప్పటిలానే అధికారిక వెబ్సైట్ results bse ap gov in ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదా ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన వాట్సప్ నెంబర్ 9552300009 నెంబర్ ద్వారా సులభంగా క్షణాల్లో తెలుసుకోవచ్చు.
ఏపీ పదో తరగతి ఫలితాలు ఆన్లైన్లో చెక్ చేయడం ఎలా
ముందుగా ఏపీ ఎస్ఎస్సి బోర్డు అధికారిక వెబ్సైట్ results bse ap gov in ఓపెన్ చేయాలి. అందులో కన్పించే రిజల్ట్ లింక్ క్లిక్ చేసి అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, పేరు ఎంటర్ చేయాలి. అంతే మీ మార్కులు, ఫలితాలు స్క్రీన్‌పై కన్పిస్తాయి. ఈ కాపీని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. మార్కుల మెమో కూడా ఇదే అవుతుంది.
ఏపీ పదో తరగతి ఫలితాలు వాట్సప్ ద్వారా ఎలా చెక్ చేయడం
ముందుగా ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 95523 00009 మీ ఫోన్లో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాట్సప్ ఓపెన్ చేసి హాయ్ అని టైప్ చేసి పంపిస్తే సర్వీసెస్ ఆప్షన్ అడుగుతుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేస్తే ఎస్ఎస్సి రిజల్ట్ లింక్ కన్పిస్తుంది. ఈ లింక్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేస్తే చాలు క్షణాల్లో పీడీఎఫ్ రూపంలో మీ మార్కుల మెమో వాట్సప్‌కు వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి