AP 10th Results 2025: ఏపీలో నిన్న అంటే ఏప్రిల్ 12న ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడిక పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కీలకమైన అప్ డేట్ వెలువడింది. పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల తేదీ ఖరారైంది.
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ ఫిక్స్ అయింది. ప్రస్తుతం ఏపీలో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఏప్రిల్ 15 నాటికి పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తరువాత మార్కుల క్రమబద్ధీకరణ, కంప్యూటరీకరణ ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యాక ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 22వ తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in/ లేదా ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 9552300009 నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 3500 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగగా మొత్తం 6.5 లక్షల మంది విద్యార్ధులకు హాజరయ్యారు. వాట్సప్ ద్వారా అయితే ముందుగా హాయ్ అని మెస్సేజ్ చేయాలి. ఆ తరువాత అందులో సర్వీసెస్ విభాగంలో ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎంచుకోవాలి. అందులో ఎస్ఎస్ సి ఫలితాలు ఆప్షన్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే చాలు మీ మార్కుల మెమో వాట్సప్ లో వచ్చేస్తుంది.
ఏప్రిల్ 22న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాక రీ కౌంటింగద్ లేదా రీ వాల్యుయేషన్ అప్లై చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే విదంగా ఫెయిల్ అయిన విద్యార్ధులకు జూన్ నెలలోనే సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి.
Also read: AP Inter Results 2025: ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ ఎలా అప్లై చేసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









