AP SSC Results 2025: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలపై బిగ్ అప్‌డేట్ వెలువడింది. పదో తరగతి ఫలితాలను రేపు ఏప్రిల్ 23 ఉదయం 10 గంటలకు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఫలితాలను మీరు https://www.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాల తరువాత ఇప్పుడిక పదో తరగతి ఫలితాలు రావల్సి ఉంది. రాష్ట్రంలో మార్చ్ 17 నుంచి మార్చ్ 31 వరకు ఈ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 6 లక్షల మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం, మార్కుల కంప్యూటరీకరణ పూర్తవడంతో ఇక ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రేపు ఏప్రిల్ 23 ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన వాట్సప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ముందుగా https://www.bse.ap.gov.in/ ఓపెన్ చేయాలి. అక్కడ మీకు కన్పించే ఎస్ఎస్‌సి రిజల్ట్స్ 2025 లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మీ మార్కులు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి. ఇదే మార్కుల మెమో. డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోవచ్చు.
ఇలా కాకుండా ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ముందు ఈ నెంబర్‌కు హాయ్ అని టైప్ చేసి పంపించాలి. ఆ తరువాత మీ సర్వీసెస్ విభాగంలో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేయాలి. ఇందులో పదో తరగతి ఫలితాలు లేదా ఎస్‌ఎస్‌సి రిజల్ట్స్ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే క్షణాల్లో మీ మార్కులు పీడీఎఫ్ రూపంలో మీ వాట్సప్‌కు వస్తుంది.
Also read: Prabhas Upcoming Movies: ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల జాబితా, రాజా సాబ్ తరువాత వరుసగా 10 సినిమాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









