AP Summer Effect: భయపెడుతున్న ఎండలు, ఈ జిల్లాలకు హై అలర్ట్ జారీ

AP Summer Effect: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత భయపెడుతోంది. నడి వేసవి రాకముందే పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మద్యాహ్నం సమయంలో అయితే బయటకు రావాలంటే భయమేస్తోంది. రానున్న రోజుల్లో ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2025, 11:06 AM IST
AP Summer Effect: భయపెడుతున్న ఎండలు, ఈ జిల్లాలకు హై అలర్ట్ జారీ

AP Summer Effect: ఏపీలో ఎండల తీవ్రత అనూహ్యంగా పెరిగింది. ఓవైపు భారీగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు మరోవైపు ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయనే హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో వడగాల్పుల తీవ్రం కానున్నాయి. 

Add Zee News as a Preferred Source

ఏపీలో మార్చ్ మొదటి వారంలోనే పగటి ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉండవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు మరింత భయపెడుతున్నాయి. మద్యాహ్నం సమయంలో వేడి గాలులు తీవ్రంగా ఉంటున్నాయి. వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినట్టే మార్చ్ మొదటి వారాంతం నుంచి వడగాలులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత అధికంగా ఉంటోంది. మార్చ్ నెలంతా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. రాయలసీమలో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలు తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. 

ఏపీలోని ఈ జిల్లాలకు హై అలర్ట్

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వడగాల్పులు వీయనున్నాయి. 

Also read: Amaravati Works: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్, అట్టహాసంగా కార్యక్రమం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News