Amaravati: రాజధాని పనులకు రైట్ రైట్..! మోడీతో ‘అమరావతి’ పున: ప్రారంభం..

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పున ప్రారంభ పనులకు ముహుర్తం ఫిక్సైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధానిలో అభివృద్ధి పనులను ప్రారంభించడం కోసం ఏప్రిల్ 15న అమరావతికి వస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 14, 2025, 04:20 PM IST
Amaravati: రాజధాని పనులకు రైట్ రైట్..! మోడీతో ‘అమరావతి’ పున: ప్రారంభం..

Amaravati: 2014లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని  యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఎన్నో కసరత్తుల తర్వాత పార్లమెంట్ లో చట్టం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసింది. దీనికి అప్పటి ప్రతిపక్షం ఇప్పటి పాలక పక్షంలో ఎన్డీయే సారథి బీజేపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే.. విభజన తర్వాత ఏపీకి ఇప్పటికీ పూర్తి స్థాయి రాజధాని లేకుండా పోయింది. 2014 విజయ దశమి రోజున చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పనులు శరవేగంగా జరుగుతాయనుకున్న టైమ్ లో తెలుగు దేశం పార్టీ బీజేపీతో తెగ తెంపులు చేసుకొని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వెసీపీ ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తూనే మూడు రాజధానులను ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

Add Zee News as a Preferred Source

విశాఖ పట్నం కార్యనిర్వాహక రాజధాని అయితే.. అమరావతి శాసన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా అక్కడ ప్రజలు ఆమోదించలేకపోయారు. దీంతో 2024లో మళ్లీ బీజేపీ, తెలుగు దేశం, జనసేన కూటమికి అక్కడ ప్రజలు పట్టం కట్టారు. జగన్ హయాములో ఆగిపోయిన పనులకు ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టబోతుంది.

ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఏప్రిల్ 15న లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు అమరావతిలో  ఒకే రోజు శ్రీకారం చుట్టనున్నారు. మూడేళ్లలో అన్ని నిర్మాణాలు పూర్తి చేసేలా చంద్రబాబు సర్కార్ ప్రణాళిక రచించింది. పలు పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ప్రధాని మోడీ పర్యటనలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News