)
Teacher Transfers: ఏపీలో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. టీచర్ల బదిలీల ప్రక్రియలో అవలంబించాల్సిన రూల్స్, మార్గదర్శకాలతో డ్రాఫ్ట్ విడుదల చేసింది ప్రభుత్వం. ఉపాధ్యాయ బదిలీలకై ప్రభుత్వం కొత్త చట్టం కూడా తీసుకురానుంది. ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ముసాయిదాపై సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించనుంది.
ఏపీలో ఉపాధ్యాయలు చాలా కాలంగా బదిలీల కోసం చూస్తున్నారు. ఇప్పుడీ టీచర్లందరికీ ప్రభుత్వం శుభవార్త అందించింది. టీచర్ల బదిలీలపై కొత్త చట్టం తీసుకొస్తున్న ప్రభుత్వం అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తోంది. మార్చ్ 7వ తేదీలోగా ఆన్లైన్లో సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే ఈ శాసనసభ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టవచ్చు. మొత్తానికి ఈ విద్య సంవత్సరం ప్రారంభయ్యేలోగా ఉపాధ్యాయల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టీచర్ల బదిలీలపై సలహాలు, సూచనలను draft.aptta2025@gmail.com పంపించాల్సి ఉంటుంది. ఈ డ్రాఫ్ట్ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఉంది. విద్య సంవత్సరం కూడా ప్రతి ఏటా జూన్ 1 నుంచి మే 31 వరకు పరిగణిస్తారు.
ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలు, అర్హతలు
ప్రధానోపాధ్యాయులు ఒకే చోట ఐదేళ్లు, ఉపాధ్యాయులైతే 8 ఏళ్లు పనిచేస్తే బదిలీకు అర్హులు అవుతారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల్ని నాలుగు కేటగిరీల్లో విభజించారు. ఇవి కాకుండా వివిధ ఇతర కారణాలు, పాయింట్లతో బదిలీ ప్రాధాన్యతల్ని నిర్దేశిస్తారు. ఉపాధ్యాయుల బదిలీ ముసాయిదా చట్టంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. టీచర్ బదిలీలు పారదర్శకంగా ఉండేందుకే ముసాయిదాను ఆన్లైన్లో ఉంచామన్నారు. ఉపాధ్యాయులు, సంఘాల నుంచి విలువైన సూచనలు, సలహాలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఉపాధ్యాయల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థ రూపొందిస్తున్నామన్నారు. మార్చ్ 7 సాయంత్రం 5 గంటల వరకూ cse.ap.gov.in/documents/DRAFT లో షేర్ చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి