)
Andhra Pradesh Rain Alert: సముద్ర మట్టానికి సమీపంలోని గాలులు తేమతో నిండి ఉండడం, ఉష్ణోగ్రతల తేడాలు ఎక్కువగా ఉండడం వలన ఈ వ్యవస్థ మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని సూచించింది. అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, విశాఖ, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. అటబాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు పడుతాయని సూచించింది. వర్షాలకు తోడు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడునున్నాయని..దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని..మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అటు తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. హైదరాబాద్ పరిసరాలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్లగొండ, నాగర్ కర్నూల్ , వనపర్తి, నారాయాణపేట, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతయాని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.