AP High Temperatures: మండుతున్న ఏపీ, ఈ జిల్లాల్లో 44 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత

AP High Temperatures: వేసవి ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఓ వైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే మరో వైపు వడగాలుల తీవ్రత అధికమౌతోంది. ఈ జిల్లాల్లో అయితే పరిస్థితి మరింత ఘోరంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2025, 08:58 AM IST
AP High Temperatures: మండుతున్న ఏపీ, ఈ జిల్లాల్లో 44 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత

AP High Temperatures: అకాల వర్షాలు ఆగిపోయాయి. ఇప్పుడు ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నడి వేసవి రాకముందే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత కన్పిస్తోంది. వీటికి తోడు వడగాలులు భయపెడుతున్నాయి. 

Add Zee News as a Preferred Source

ఏపీలో గత కొద్ది రోజులుగా ఎండలు భారీగా పెరిగిపోయాయి. వాతావరణంలో మార్పులతో అడపా దడపా కురిసిన అకాల వర్షాలు ఆగిపోవడంతో వాతావరణం మళ్లీ వేడెక్కింది. రాయలసీమ జిల్లాల్లో వడగాలులు, భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న బాపట్లలో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు కడప, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా పెద్దఎత్తున ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 119 ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటింది. ఇవాళ కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత ఉండవచ్చని అంచనా. 

ఇక మరో 15 రోజులు ఎండలు 44 డిగ్రీల వరకూ చేరుకుని మే నెలలో 45 డిగ్రీలు దాటుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే సమయంలో వడగాలుల తీవ్రత అంతకంతకూ పెరుగుతూ మే నాటికి పీక్స్‌కు చేరుతుందని అంచనా. అంటే ఓ వైపు ఎండలు మరోవైపు వడగాలులతో పరిస్థితి భయానకంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ప్రజలు ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచిస్తోంది. రాష్ట్రంలోని 14 మండలాల్లో తీవ్ర వడగాలులు, 68 మండలాల్లో వడగాలులు కన్పించాయి. ఇవాళ, రేపు కూడా వడగాలుల ప్రభావం కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 30 మండలాల్లో తీవ్రంగానూ 67 మండలాల్లో సాధారణంగానే వడగాలులు వీయనున్నాయి. 

ఇవాళ విజయనగరం జిల్లాలో 11 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10, శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎండలు, వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తోంది. 

Also read: Amaravati Capital Works: అమరావతిలో మళ్లీ భూ సమీకరణ, మరో 44 వేల ఎకరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News