AP Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఓ వైపు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం మరోవైపు రానున్న24 నుంచి 96 గంటల్లో ఏపీలో విస్తారం వర్షసూచన జారీ అయింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం బలపడనుంది. దాంతో ఈ నెల 12 వరకూ మోస్తరు వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ప్రవేశించనుంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ అల్పపీడనం తరువాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బలహీనపడనుంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రానున్న నాలుగు రోజులు అంటే ఏప్రిల్ 12 వరకూ ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి.
ఈ నెల 12 వరకూ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అండమాన్ తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమంగా ఏపీవైపుకు రావచ్చు. అందుకే ఏపీలో ఈ నెల 9 నుంచి 12 వరకూ వర్షాలు పడనున్నాయి. రేపు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రమంతటా బలమైన ఈదురుగాలులు వీస్తాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
ఇక ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు ప్రభావం చూపించనున్నాయి. ఆ తరువాత అంటే ఏప్రిల్ 12 తరువాత కోస్తాంధ్ర, యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
Also read: Amaravati Works: అమరావతి నిర్మాణ పనుల రీలాంచ్ ముహూర్తం ఖరారు, ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









