)
Heavy Rains Warning: ఏపీలో విచిత్రమైన వాతావరణం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరోవైపు నైరుతి రుతు పవనాలు ప్రభావం చూపించనున్నాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకిన నైరుతి రుతు పవనాలు ఈ నెల 27న కేరళను తాకనున్నాయి.
నైరుతి రుతు పవనాలు ఈసారి ముందుగానే ప్రవేశిస్తున్నాయి. జూన్ 10వ తేదీన ఏపీలో ఎంట్రీ ఇవ్వనున్నాయి. మరోవైపు వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాల్లో అయితే ఎండలతో పాటు వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి ఉధృతి కారణంగా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలో ఎవరూ ఉండవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు గట్టిగా ఉండటంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అటు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురిసింది. రానున్న 4 రోజులు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి