
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి క్రమంగా బలపడుతోంది. రానున్న రోజుల్లో ఇది తీవ్ర తుపానుగా బలపడనుంది. ఈ క్రమంలో వారం రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీకు శక్తి తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఆవహించి ఉన్న అల్పపీడన ద్రోణి కారణంగా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఉపరితల ఆవర్తనం కారణంగా నైరుతి రుతు పవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా మరో రెండ్రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. రేపు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు కూడా పడనున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 5 మిల్లీమీటర్లు, అనంతపురం జిల్లా చిన్నమూష్టములో 51 మిల్లీమీటర్లు, నర్సీపట్నంలో 50 మిల్లీమీటర్లు, గుంటూరులో 48 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
రానున్న 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. విజయనగరం, పార్వతీపురం మన్యం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. కోనసీమ, తూర్పు గోదావరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి