Shakti Cyclone Alert: ఓ వైపు మండు వేసవిలో ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో తుపాను పొంచి ఉంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానుకు శక్తి అని నామకరణం చేశారు. తుపాను ప్రభావం ఏపీపై అధికంగా ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఉంది. ఉపరితలంపై 5.8 కిలోమీటర్ల ఎత్తులో గాలి వ్యాపించి ఉంది. రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం మరింతగా బలపడి తమిళనాడు తీరం దాటి ఉత్తర దిశగా కదలనుంది. రానున్న రెండు రోజుల్లో ఇది తుపానుగా మారనుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి. మొత్తానికి తుపాను ప్రభావం వారం రోజులు ఉండవచ్చని తెలుస్తోంది.
శక్తి తుపాను ప్రభావం ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూలు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా తుపాను కారణంగా భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం నెల్లూరు మీదుగా ఒంగోలు, గుంటూరుకు చేరవచ్చు. అక్కడి నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వైపుకు వెళ్లనుంది. ఫలితంగా రానున్న వారం రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి.
మరో వైపు ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు త్వరగా రానున్నాయి. ఇప్పటికే ఇవి నికోబార్ దీవుల్ని తాకాయి. మరో 3 రోజుల్లో మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటాయి. ప్రస్తుతం రుతు పవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవుల వద్ద ఉన్నాయి. మహారాష్ట్రలోని విదర్భ నుంచి రాయలసీమ వరకు ఉన్న ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతోంది.
Also read: High Alert: స్లీపర్ సెల్స్ కోసం ముమ్మరంగా గాలింపు, యూట్యూబర్ అరెస్ట్‌తో హై అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి