
AP Rain Alert: మార్చ్ నెలలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో అయితే పరిస్థితి మరింత విషమించనుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో రానున్న నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌కు వర్షసూచన జారీ అయింది.
భగభగ మండే ఎండలతో విలవిల్లాడుతున్న ప్రజలకు గ్రేట్ రిలీఫ్ లభించనుంది. ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. రానున్న నాలుగు రోజులు ఏపీలో మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. ఈ నెలాఖరు వరకూ ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రత కాస్త తగ్గనుంది.
ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. దాంతో రేపట్నించి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి తెలంగాణ, కర్ణాటక మీదుగా కొనసాగుతోంది. అందుకే రానున్న 4 రోజుల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి