Heavy Rain Alert: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక, పిడుగుల పడే ప్రమాదం

Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో విభిన్నమైన వాతావరణ కన్పిస్తోంది. ఉత్తర మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2025, 11:19 AM IST
Heavy Rain Alert: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక, పిడుగుల పడే ప్రమాదం

Heavy Rain Alert: వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న రెండు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావం మరో రెండు రోజులు ఉండనుంది. 

Add Zee News as a Preferred Source

ఏపీ, తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే మరో వైపు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకోవైపు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భయపెడుతోంది. అకాల వర్షాల కారణంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఐఎండీ అంచనా ప్రకారం రానున్న రెండు రోజుల్లో ఏపీలోని అనకాపల్లి, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప, ఏలూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులు పడనున్నాయి. దాంతో పాటు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 

ఇక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కాకినాడ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడం మంచిది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉంటాయి. ఈదురుగాలుల కారణంగా చెట్లు విరిగిపడవచ్చు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఆరుబయట, చెట్లు, టవర్ల కింద ఉండవద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. 

Also read: AP SSC Results 2025: గుడ్‌న్యూస్, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఎలా చేసుకోవాలంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News